fbpx

జనసేనలోకి బోసు..?

Share the content

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీలో అసమ్మతి వర్గాలు బయటకు వస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జోరు అందుకుంది. రామచంద్రపురం నియోజకవర్గ సీటును తన కుమారుడికి బోసు ఆశించారు. అయితే ఆ సీటును వేణుకి అధిష్టానం కేటాయించింది. దీంతో ఆగ్రహించిన బోసు పార్టీ వీడుతున్నట్లు సమాచారం. బోసు తన కుమారుడి తో సహా జనసేన లోకి వెళ్తున్నారు అనే ప్రచారం జోరు అందుకుంది.

బుజ్జగిస్తున్న అధిష్టానం

పార్టీ సీనియర్ నేతగా రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ అనుభవం ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ వీడుతున్నారని వార్త అధిష్టానం దృష్టికి రావడంతో సుభాష్ ను తాడేపల్లికి అధిష్టానం పిలిపించింది. అయితే బోస్ తో నేరుగా సీఎం జగన్ మాట్లాడకుండా గోదావరి జిల్లాల ఇన్చార్జ్ మిధున్ రెడ్డి ఆయనతో మాట్లాడటం బోసును మరింత అగ్రహానికి గురిచేసింది గత ఎన్నికల్లో కూడా పక్క నియోజకవర్గము నుండి తీసుకువచ్చిన వేణుకి టికెట్ ఇచ్చి బరిలోకిదింపటం తీవ్ర అగ్రహానికి గురిచేసింది అప్పట్లో ఆయనను బుజ్జగిచి రాజ్యసభ సీటును కేటాయించింది. అయితే రానున్న ఎన్నికల్లో తన కుమారుడికి సీటు ఆశించిన బోసుకు అధిష్టానం నుండి మరొకసారి ఎదురు దెబ్బ తగలడంతో తీవ్ర ఆవేశంతో ఉన్నారు. మిధున్ రెడ్డితో మాట్లాడిన కోపం వీడ లేదు. మిథున్ రెడ్డితో చర్చ ఫలించకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి జగన్ స్వయంగా బోసుతో మాట్లాడారు. తమ కుమారుడికి టికెట్ ఆశిస్తున్న విషయం ముందుగానే తన దృష్టికి తీసుకువచ్చి ఉంటే బాగుండేదని జగన్ అన్నట్లు తెలుస్తుంది. ఇప్పట్లోకుటుంబ రాజకీయానికి ప్రాధాన్యతఇచ్చే అవకాశం లేదనిపార్టీ నుండి తనకు తగిన గుర్తింపు ఉంటుందని జగన్ కూడా బోసుకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా బోసు మాత్రంఆగ్రహం వీడలేదు ఢిల్లీలోని తన కోటర్స్ ను బోసు కాళీ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పార్టీ వీడితే ఆయన పయనం ఎటువైపు అనే విషయం ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది. బోసు తన కుమారుడితో సహా జనసేన లోకి చేరుతారు అనే వార్త జోరుగా ప్రచారం అందుకుంటుంది. కానీ బోసు మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు మునుపు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి గానే పోటీ చేస్తానని ఆయన అన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఎటువంటి అవినీతి ఆరోపణ లేని రాజకీయ అనుభవం ఉన్న సౌమ్యుడిగా బోసుకు మంచి పేరు ఉంది. జనసేన పార్టీకి వస్తే జనసేన కూడా మరింత బలం చేకూరుతుంది. అలాగే రామచంద్రపురం లోని జనసేనకు కూడా గట్టి అభ్యర్థి లేరు. రామచంద్రపురం లో గట్టి బలమున్న బోసు జనసేనలోకి వస్తే జనసేనకు కూడా ప్లస్ అవుతుంది. కానీ ఇప్పటివరకు జనసేన నాయకులు గాని బోసు గాని ఈ విషయంపై పెదవి విప్పడం లేదు. గత ఎన్నికల్లో లాగా బోసు బుజ్జగింపులకు లొంగుతారా లేదా పార్టీ మారుతారా అనే విషయం వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *