fbpx

వ్యూహత్మక అడుగులు

Share the content

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై రాజకీయ పార్టీలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏ సమయంలోఅయినా ఎన్నికలు రావచ్చని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ అటు జనసేన తెలుగుదేశం పార్టీలు ప్రజముఖంగా ప్రశ్నిస్తున్నాయి. ఎలా అయినా సరే వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రావాలని అధికార వైసీపీ కసరతులు ప్రారంభించింది. తాజాగా జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులకు గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశాలు చేశారు. జిల్లా ఇన్చార్జిలు కోఆర్డినేటర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి లోపాలను సరి చేసే విధంగా ముందుకు సాగాలంటూ సూచనలు చేశారు. అసంతృప్తి నేతలు ఇతర పార్టీలకు వెళ్ళకుండా సర్ది చెప్పే బాధ్యతను జిల్లా ఇన్చార్జిలకు అప్పచెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

ముందస్తుపై ఇవ్వని క్లారిటీ….

ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ముందస్తు ఎన్నికలపై మంతులు జగన్మోహన్ రెడ్డిని అడిగారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ముందస్తు ఏమి ఉండవని తమ పని తమ చేసుకోవాలంటూ మంత్రులకు సూచనలు చేశారు. ఏమైనా ఉంటే నేను చూసుకుంటానని నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్కరికి సంక్షేమం చేరువ చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జగన్ అన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ముందస్తు ఎన్నికల ట్రాప్ లో పడొద్దు అంటూ సూచించారు. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి అశేషమైన స్పందన లభించిందని గడపగడప కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మంత్రులకు సూచనలు చేశారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాల కు దీటుగా సమాధానం చెప్పాలని సూచించారు. ఎన్నికల సమయంలో గెలుపే లక్ష్యంగా పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తు పెట్టుకుని తగిన గుర్తింపునిస్తుందని పార్టీ నుండి ఎవరు బయటకు వెళ్లకుండా చూసుకునే బాధ్యతను జిల్లా ఇన్చార్జిలకు అప్పచెప్పారు జగన్. ముందస్తు ఎన్నికలు లేవంటూనే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. దీంతో మంత్రులు ముందస్తు ఎన్నికలపై అయోమయ పరిస్థితిలో పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *