fbpx

వైసిపి గేమ్ ప్లాన్ స్టార్ట్

Share the content

జనసేన పార్టీలో చిచ్చుపెట్టేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీని పూర్తిస్థాయిలో బలహీనం చేసే పనుల్లో భాగంగా అన్ని దారులను వైసీపీ వెతుకుతోంది. తాజాగా గతంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు తీసివేసిన సిబ్బంది లో ఉన్న ఓ యువకుడ్ని పట్టుకొని వైసీపీ సోషల్ మీడియా వేదికగా విష ప్రచారాన్ని తీవ్రతరం చేస్తోంది. సదరు యువకుడు ఇప్పటికే వైసీపీ శిబిరంలో చేరినట్లు అతని వాట్సాప్ స్టేటస్ లు కూడా తెలియజేస్తున్నాయి. దీంతో వైసిపి కావాలనే పార్టీ కార్యాలయంలో కీలకంగా పనిచేసిన ఆ యువకుడితో కలిసి కావాలని దెబ్బకొట్టే ప్లాన్లు వేస్తోంది.

** జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇటీవల 30 మందిని పవన్ కళ్యాణ్ తొలగించారు. వ్యయ నిర్వహణలో భాగంగా అలాగే ఎలాంటి పని లేని కార్యాలయ సిబ్బందిని మొత్తం ఫిల్టర్ చేసి మరి పవన్ కళ్యాణ్ తొలగించారు. దీనిలో భాగంగా గతంలో హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఫ్రంట్ ఆఫీస్ బాధ్యతలు చూసే ఓ యువకుడిని కూడా కేంద్ర కార్యాలయం మంగళగిరి మారడంతో పవన్ కళ్యాణ్ తొలగించారు. ఆ యువకుడు ఇప్పుడు వైసీపీ గేమ్ ప్లాన్ కు ప్రధాన అస్త్రంగా మారాడు. పవన్ కళ్యాణ్ కు గతంలో వచ్చిన ఉత్తరాలు ఇతరత్రా వివరాలు అన్ని తెలుసుకున్న ఆ యువకుడు ఇప్పుడు వాటిని బహిరంగపరచడంతో పాటు జనసేన పార్టీలో కీలకమైన నేతలు నాదెండ్ల మనోహర్ అలాగే కొణిదెల నాగబాబుల మధ్య వైరం ఉందని కొత్త విషయాలను చెప్పడం వైసిపి గేమ్ ప్లాన్ లో భాగం. పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య కచ్చితంగా గొడవ పెట్టాలని.. జనసేనలో ఏదో జరుగుతోందని కార్యకర్తల్లో ఉన్న నైతిక ధైర్యం కూడా పూర్తిస్థాయిలో తగ్గించే విధంగా ఆ యువకుడుతో వైసిపి వీడియోలు చేపిస్తోంది. రకరకాల విషయాలతో ఆ యువకుడు వీడియోలు చేయడం దానిని వైసిపి అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త రచ్చ కు తెర లేపాలని వైసిపి భావిస్తోంది. చాలా చిన్న విషయాలు కామన్ విషయాలను కూడా చాలా పెద్దవిగా చూపించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు భారీగా నష్టం చేకూర్చాలని ఎలాగైనా కార్యకర్తల్లో ఉన్న నమ్మకాన్ని తొలగించాలి అని వైసిపి పన్నుతున్న కుట్రలో భాగంగా ఇప్పుడు అన్ని రకాల దారులను వెతకడం విశేషం. వైసిపి ఎన్నికలకు మరిన్ని విష ప్రచారాలకు కచ్చితంగా తెరలేపే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీ సమయంలోనే ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేనిని కూడా అంత తేలికగా తీసుకోవడం లేదు. ఎవరిని పడితే వారిని నమ్మే పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ కు లేదు. పవన్ కళ్యాణ్ సీరియస్ రాజకీయ నాయకుడిగా మారుతున్న వేల కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతారని సర్వేలో తేలుతున్న సమయంలో వైసిపి జనసేన పార్టీలో చిచ్చు రేపడానికి రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టిందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *