fbpx

ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు…సుప్రీం సీజీఐకు క్వాష్ పిటిషన్ బదిలీ

Share the content

స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుకు రిమాండ్‌ విధించే అధికారం ట్రయల్‌ కోర్టుకు ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబుకు విధించిన రిమాండ్‌ సమంజసమేనని జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా త్రివేది లు తీర్పు వెలువరించారు.అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే.. సీఐడీ తరఫున ముకుల్ రోహతీ వాదనలు వినిపించారు. ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఇద్దరు న్యాయమూర్తులు 17 ఏ సెక్షన్‌కు… రిమాండ్‌ కు ముడిపెట్టలేమని తెలిపారు. 17ఏ సెక్షన్‌ వర్తింపు విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తదుపరి నిర్ణయం కోసం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు బదిలీ చేశారు. ముగ్గురు లేదా అయిదుగురు జడ్జిల బెంచ్‌ ద్వారా ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది.. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్‌ కొట్టేయలేమని వెలువరించారు.

గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది : జస్టిస్ అనిరుద్ధబోస్
చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సింది, గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్‌ ఆర్డర్‌ను కొట్టేయలేం, అనుమతి లేనంత మాత్రాన రిమాండ్‌ ఆర్డర్‌ నిర్వీర్యం కాదు,రిమాండ్‌ రిపోర్ట్‌ను కొట్టేయాలని గానీ, చెల్లుబాటు కాదని గానీ చెప్పలేం, రిమాండ్‌ చెల్లుతుంది, కొనసాగుతుంది. ఈ కేసులో 17ఏ వర్తిస్తుందని, చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సిందని జస్టిస్ అనిరుద్దబోస్ తీర్పు వెలువరించారు.

అవినీతి నిరోధ చట్టానికి ముడి పెట్టలేము : జస్టిస్‌ బేలా త్రివేది
స్కిల్ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమేనని జస్టిస్‌ త్రివేది తీర్పు ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదయిన ఈ కేసును 17ఏకి ముడిపెట్టి ఊరట ఇవ్వలేం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు అని జస్టిస్ బేలా త్రివేది తీర్పు వెలువరించారు. గవర్నర్ అనుమతి లేదనే కారణంతో FIRను క్వాష్ చేయడం కుదరదని వెలువరించారు. ట్రయల్‌ కోర్టు (ACB కోర్టు, విజయవాడ) ఇచ్చిన రిమాండ్‌ పూర్తిగా సబబేనని వెలువరించారు.స్కిల్ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చు, ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయవచ్చు, న్యాయప్రక్రియ కొనసాగుతుంది అని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *