fbpx

రిషికొండ భవనాలకు జగన్ పెట్టిన పేర్లు తెలుస్తే షాక్ అవుతారు.

Share the content

రోజుకో మాట.. వారానికో గడువు.. నెల రోజులకు ఓ బూటకం మాట చెప్పి విశాఖ నగరానికి ప్రకృతి విపత్తుల నుంచి ముఖ్యంగా సముద్రం నుంచి వచ్చే గాలుల నుంచి రక్షణ కల్పించే ఋషికొండను జగన్ ఎలా విధ్వంసం చేశాడు కళ్ళ ముందు అందరికీ తెలుసు. ఆఖరికి ఎన్నో మాటల తర్వాత ఋషికొండపై కడుతుంది సీఎం క్యాంపు కార్యాలయం అని ఇటీవల ప్రకటించిన వైసీపీ నేతలు… సీఎం క్యాంప్ కార్యాలయానికి పెట్టిన పేర్లు కూడా విచిత్రంగానే ఉన్నాయి..

విశాఖ నగరానికి మణిమకుటంలా బాసిల్లే ‘రుషికొండ భవిష్యత్తు లో కనిపించే అవకాశం లేదు. కొండపై ఏకంగా 50 శాతానికి పైగా విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులిచ్చేశారు. అవన్నీ పూర్తయితే ఇక రుషి కొండ పేరుకే మిగులుతుంది తప్ప అక్కడ కొండన్నది ఉండదు. రుషికొండ బీచ్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పర్యాటకులు దీన్ని విశాల గోదాగా పిలుస్తుంటారు. అలాంటి బీచ్ కు వెన్నెముకగా ఉండే రుషికొం డను వైకాపా ప్రభుత్వం విధ్వసం చేసింది.

** ఎండాడ రెవిన్యూ సర్వే నంబరు 19/1, 19/3, 19/ లలో మొత్తం 63.85 ఎకరాల్లో, రుషి కొండ విస్తరించి ఉంది. కొండపై రిసార్ట్స్ పునర్నిర్మాణం పేరిట గతంలో ఉన్న స్థలంలో కంటే అదనంగా తవ్వేస్తున్నారు. దీనిని మొదట బయటకు తీసింది జనసేన పార్టీ నేత.. విశాఖపట్నం కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఆయన దీనిపై 2021 డిసెంబరులో హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత దీనిలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎంపీ రఘురామ కృష్ణ రాజు కూడా పిటిషన్లు వేశారు. దీంతో పర్యాటకశాఖ అధికారులు 1.88 ఎకరాల విస్తీర్ణంలో హరిత రిసార్ట్స్ పునర్నిర్మాణానం అటవీశాఖ నుంచి వచ్చిన అనుమతులు కోర్టుకు చూపారు.

** గతంలో కొండపై 5.09 ఎకరాల విస్తీర్ణంలో హరిత రిసార్ట్స్ ఉండేవి. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వాటిని పునర్నిద్ధిస్తామని. అడుగడుగునా ఉల్లంఘనే చేశారు. అప్పటి పర్యాటకశాఖ మంత్రికి కూడా తెలియకుండా వాటిని కూల్చేశారు అంటే… వెనుక ఎవరు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. కూల్చడానికి, తిరిగి నిర్మించడానికి మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా పర్యాటక శాఖ అధికారులు దాన్ని పట్టించుకోలేదు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మొత్తం కూల్చారు.

** రుషి కొండ పై రిసార్ట్స్ విస్తీర్ణం 9.65 ఎకరాలైతే అందులో ఏకంగా 61 ఎకరాల్లో కట్టడాలకు జీవీ ఎంసీ ప్లాను మంజూరు చేయడం గమనార్హం.
అనుమతులు తీసుకుని జీవీఎంసీకి ప్లాను కోసం దరఖాస్తు చేశారు. తర్వాత మోసపూరితంగా 21 ఎకరాల్లో కొండను తొలిచేశారు. ఎగ్జిటీ సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ఇక్కడ తవ్వేశారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది.

** న్యాయస్థానాల్లో కేసులు ఉండగానే పర్యాటకశాఖ 11 ఎకరాల్లో నిర్మా ణాలకు ప్లాను కోసం మరోసారి జీవీఎంసికి.. దరఖాస్తు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ
శాఖ ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా జీవీఎంసీ ప్లాను మంజూరు చేసేసింది. 50 విస్తీర్ణంలో రిసార్టులు ఉండేవి. ఇప్పుడు అనుమతులు పొందిన విస్తీర్ణం ఏకంగా 61 ఎకరాలకు చేరుకుంది. ఈ లెక్కన ఖాళీ స్థలాల పన్ను (వీఎల్) కింద రూ. 100 కోట్ల వరకు జీవీఎంసీకి చెల్లిం చాల్సి ఉంది. ఈ విషయాన్ని రెండు శాఖల అధికారులు పట్టించుకోలేదు.

** ఋషికొండపై జగన్ నిర్మించిన భవనాలు వాటి పేర్లు కూడా కాస్త విచిత్రంగానే ఆయన భావాలకు విరుద్ధంగాను అనిపిస్తాయి.

** విజయనగర్ బ్లాక్ (1) 1198.52 చదరపు మీటర్లు,

** విజయనగర్ బ్లాక్ (2) 964.81 (చ.మీ.),

** విజయనగర్ బ్లాక్ (3) 1662.53 (చ.మీ.) మొత్తం 3825.86 చదరపు మీటర్లు. 900 చ.మీ.

** వేంగి బ్లాక్ బి 926.06(చ.మీ.)

** కళింగ బ్లాక్ : 7,266.32 చ.మీ.

** వేంగి బ్లాక్ ఎ: 928.06 చ.మీ.,

మొత్తం 1854.12 చదరపు మీటర్లు.

** మొత్తం విస్తీర్ణంలో 21 ఎకరాల్లో మొదట భాగం తొలిచేశారు. భవిష్యత్తులో మిగతా 10 ఎకరానూ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే రుషికొండ పూర్తిగా కనుమరు గయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్లాను పొందే సమయంలో ఏయే నిర్మానాలు చేస్తున్నారో జీవీఎంసీకి కచ్చితంగా తెలియజేయాల్సి ఉన్నా, ఎలాంటి సమా చారం ఇవ్వలేదు.

** పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాలకు భవన రుసుములు కింద రూ. 10.05 కోట్లు చెల్లించాలి. వాటిని అయిదేళ్లలో సర్దుబాటు చేసేలా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం విశేషం.
సీ నిబంధనల ప్రకారం తీరం పక్కన భూగర్భ జలాలను తోడకూడదు. కానీ ఇక్కడ హైస్పీడ్ బోర్లతో నీరు తోడినట్లు ఆరోపణలున్నాయి.
ఏలాంటి అనుమతులు లేకుండానే పూర్త నిర్మాణాల చుట్టూ రహదారులను నిర్మిస్తున్నారు. దాదాపు రుషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలు.. అక్కడ వెలుస్తున్న భవనాలు అన్నీ కూడా చట్ట విరుద్ధంగా… అలాగే నిబంధనలు పట్టించుకోకుండా కడుతున్నప్పటికీ అధికారులు కళ్ళు మూసుకోవడం చూస్తే రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం అవుతుంది.. అసలు అంత హడావుడిగా ఋషికొండ మీద భవనాలు నిర్మిస్తూ….. వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకపోతే ఋషికొండ మీద నిర్మించిన భవనాలు పరిస్థితి ఏమిటి?? దసరా నాటికి విశాఖ వస్తానని రుషికొండ నుంచి పాలన సాగిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు డిసెంబర్ నుంచి వస్తానని చెబుతున్నారు. డిసెంబర్ నుంచి అనుకుంటే ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల సమయం ఉంటుంది. మరి అలాంటప్పుడు నాలుగు నెలలకు ఎందుకు ఇంత హడావిడి..? ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాను అని అంత గ్యారెంటీ జగన్ కు ఏమిటి..? మళ్లీ సీఎం అవుతారని అంత ఖచ్చితంగా జగన్ కి ఏమైనా తెలుసా..? ఇది కాస్త ఆలోచించాల్సిన వ్యవహారమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *