fbpx

సీటు హామీ లేక కలవరం.

Share the content

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడిగా, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్ళీ సొంత గూటికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీలో చేరాలని కొత్తపల్లి సుబ్బారాయుడు భావించినప్పటికీ.. జనసేన పార్టీ నుంచి ఆయనకు కచ్చితంగా సీటు ఇస్తామని హామీ లేకపోవడంతో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా విమానాశ్రయంలో లోకేష్ ను కలిసి పార్టీలోకి మళ్లీ తిరిగి వచ్చే ప్రతిపాదనను కొత్తపల్లి సుబ్బారాయుడు చేసినట్టు తెలిసింది. లోకేష్ కొత్తపల్లి సుబ్బారాయుని ఆహ్వానిస్తూనే వెంటనే ప్రస్తుతానికి ఏమి ఇవ్వలేదని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

** వైసిపి నుంచి సస్పెండ్ అయిన తర్వాత మళ్లీ రాజకీయాల్లో తన ప్రభావం నిలుపుకోవాలి అంటే కచ్చితంగా తనకు అనుకూలమైన పార్టీలోకి వెళ్లాలని కొత్తపల్లి సుబ్బారాయుడు భావిస్తున్నారు. అయితే సొంత నియోజకవర్గం నరసాపురంలో జనసేన పార్టీ మత్స్యకారుడు అయిన బొమ్మిడి నాయకర్ కు ప్రాధాన్యం ఇస్తుండడం గత ఎన్నికల్లో సైతం నాయకర్ మంచి ఓట్లు తెచ్చుకోవడం ప్రస్తుతం జనసేన పార్టీలో కీలకమైన మత్స్యకార వికాస విభాగం చైర్మన్ గా భూమిని ఉండడంతో వచ్చే ఎన్నికల్లో దాదాపు నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ పోటీ చేయడం ఖరారు అయింది. దీంతో కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలోకి వస్తారు అని చేసిన ప్రచారం.. నరసాపురం సీటు విషయంలో జనసేన పార్టీ నుంచి హామీ రాకపోవడంతో ఆయన మళ్ళీ ఆలోచనలో పడ్డారు. దీంతో కచ్చితంగా నరసాపురం నుంచి పోటీ చేయాలి అని భావిస్తున్న కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడారు. దేశం పార్టీకి ప్రస్తుతం నరసాపురంలో బలమైన నాయకత్వం లేకపోవడంతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తపల్లి నర్సాపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండడంతో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకంలో కచ్చితంగా నరసాపురం సీటును జనసేన ఆశిస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న కొత్తపల్లి ఇటీవల లోకేషన్ కలిసిన సందర్భంగా కూడా లోకేష్ నుంచి కూడా ఎటువంటి సీటు హామీ రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. లోకేష్ ను కలిసిన తర్వాత సిటి విషయంలో హామీ వస్తుందని మొదట కొత్తపల్లి భావించారు. అయితే అటువైపు నుంచి కూడా ఏమాత్రం హామీ లేకపోవడంతో పాటు.. తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తామని మాత్రమే చెప్పడంతో కొత్తపల్లి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు సతమతం అవుతున్నట్లు సన్నిహితులు ద్వారా తెలుస్తోంది. ఏదిఏమైనాప్పటికీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడమే ఉత్తమం అనే భావనకు కొత్తపల్లి వచ్చిన ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *