fbpx

నాయుడు మోసపోయారా?

Share the content

ఎస్ సి వి నాయుడు ను జగన్ మోసం చేశారా.?? ఆయనకు ఎన్నికల ముందు ఇస్తానన్న కనీస ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకుండా మొహం చాటేసారా..? సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరున్న ఎస్ సి బి నాయుడు వైసీపీ వేసిన గాలానికి పూర్తిగా బలి అయ్యారా..?? అని అనేక ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గం ఎస్సీవీ నాయుడుకు మంచి పట్టు ఉంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మీద ఆయన గెలిచిన పేరు ఉంది. కాంగ్రెస్లో సీనియర్ లీడర్ గా వైయస్ కు సన్నిహితుడిగా పేరు ఉన్న ఎస్సీవి నాయుడు ఆ తరువాత చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకున్నది లేదు. అయితే 2019 ముందు ఆయన వైసీపీలో చేరారు. పార్టీ కోసం పని చేయాలని స్వయంగా జగన్ చెప్పడంతో ఆయన వైసిపి లోకి వచ్చారు. జగన్ ఆయనను కండువా వేసి కచ్చితంగా శ్రీకాళహస్తిలో, సత్యవేడులో పార్టీ కోసం పని చేయాలని పూర్తిస్థాయిలో సహకారం అందించాలని స్వయంగా జగన్ కోరారు. ఎన్నికలు అనంతరం కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించుకుంటానని కూడా జగన్ చెప్పారు. ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రావడంతో పాటు శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గం లో వైసీపీకి మంచి మెజారిటీ కూడా వచ్చింది.

ఎన్నికల తర్వాత మారిన సీన్

చిత్తూరు జిల్లాలో గుర్తింపు ఉన్న నాయకుడిగా ఎస్సివి నాయుడుకు పేరు ఉంది. ఆయనకు రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన అనుచరగనం ఉంది. గ్రామాలపై పట్టు అధికం. ఎస్ సి బి నాయుడు కోసం బలంగా పనిచేసే కార్యకర్తలు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ చెప్పినట్లుగా పార్టీ కోసం గట్టిగా కష్టపడి నాయుడు పనిచేశారు. అక్కడ మంచి మెజారిటీ రావడానికి ఆయన కూడా కష్టపడ్డారు అని చెప్పొచ్చు. ఎన్నికల తర్వాత ఎస్ సి వి నాయుడు చాలాసార్లు జగన్ ను కలవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. పార్టీ పెద్దల వద్ద కూడా ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీను ఎన్నోసార్లు గుర్తు చేసిన ఫలితం లేకపోయింది. కనీసం నాయుడుకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా జగన్ అంగీకరించే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ పెద్దలను పలుమార్లు అడిగిన ఏమాత్రం చలించ పోవడంతో విధిలేక ఆయన ఇప్పుడు పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపిన ఎస్సివి నాయుడు త్వరలోనే టిడిపిలోకి రానున్నారు. టికెట్ హామీ అనేది పక్కన పెడితే టిడిపిలోకి రావడానికి అన్ని రకాల ఆయన సంసిద్ధం అయ్యి వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీలో ఘోరంగా మోసపోయానని భావిస్తున్న ఎస్సీవి నాయుడు ఈసారి కసి మీద ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.

త్వరలోనే టిడిపిలో చేరుతున్న ఎస్సీబీ నాయుడుకు కచ్చితంగా రెండు నియోజకవర్గాల్లో గెలిపించే సత్తా కూడా ఉంది. ఇది కచ్చితంగా చిత్తూరు జిల్లాలో టిడిపికి మరింత బలం పెంచే విషయం. ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న నాయుడు త్వరలోనే టీడీపీలో చేరితే కచ్చితంగా ఆ ప్రభావం వైసిపి పై పడుతుంది అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *