fbpx

కాంగ్రెస్ లో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు కుట్ర : సజ్జల

Share the content

వైయస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర కోణం ఉందని వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.శనివారం వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ ను గద్దె దించడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఎప్పుడూ కాంటాక్ట్ లోనే ఉంటున్నారని తెలిపారు. తాజాగా షర్మిల కాంగ్రెస్ లో చేరికతో మరోసారి చంద్రబాబు క్యారెక్టర్ బయటపడిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికలల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయిని,అలాంటి పార్టీకి సంబంధించినంతవరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిదన్నారు. షర్మిల ఏరోజైతే తెలంగాణాలో పార్టీ పెట్టారో ఆరోజే ఆమె ప్రస్ధానం ఒక దిశలో మొదలు అయ్యిందన్నారు.ఆ తర్వాత కాంగ్రెస్ లోకి ఆమె రావాలనుకున్నారు. దానివెనుక ఎవరున్నారో ప్రజలకు, దేశానికి, అందరికి తెలుసని వెల్లడించారు. చంద్రబాబు ఓ వైపు కాంగ్రెస్ ను మరోవైపు బిజేపిని తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కల్యాణ్ ను కూడా మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. మీడియా సహకారంతో కుట్ర చేశారు, దానిలో భాగంగానే షర్మిల చేరిక కూడా జరిగిందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

  • యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలు కాదు
    బిజెపి ఎంపి సిఎం రమేష్ ఫ్లైట్ లో షర్మిల వెళ్ళడం,బ్రదర్ అనిల్ తో బిటెక్ రవి చర్చించడం ఇవన్నీ యాధృచ్చికంగా జరిగినవి అని మేం భావించడం లేదున్నారు.బ్రదర్ అనిల్ ను టిడిపి వాళ్లు ఎంతగా దుమ్మెత్తి పోసేవారు అందరికి తెలుసన్నారు క్రిష్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని, బ్రదర్ అనిల్ వస్తున్నారని ఆయనపై విమర్శలు చేసేవారు. బ్రదర్ అనిల్ వస్తే మర్యాదపూర్వకంగా వెళ్లి ఎయిర్ పోర్టులో కలిశారని చెబుతారు. అక్కడ బిటెక్ రవి మర్యాదపూర్వకంగా ఎలా కలుస్తారో అర్ధం కావడం లేదున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి మాట్లాడటం ఇవన్నీ కూడా అందరికి తెలిసినవే అని అన్నారు.. సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి గాని,లేదా మరో పార్టీలోకి చేరడం అనేది షర్మిల ఇష్టం. ఆమె ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు.అయితే ఒకసారి ఇక్కడకు వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగానే ఉంటారు. ఆమె ఇక్కడకు వస్తారని ఇంతవరకు ఎనౌన్స్ చేయలేదు. ఏపి నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగానే ఏపికి వస్తారు. ఇలాంటిది గతంలోనే జరిగింది. మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్స్ అప్పుడే వివేకానందరెడ్డిగారిని కాంగ్రెస్,తెలుగుదేశం కలిసే ఎన్నికల్లో చేశారన్నారు. కడపలో జగన్మోహన్ రెడ్డిని,వైసిపి పార్టీని మొగ్గలోనే తుంచాలని ప్రయత్నించారని పేర్కొన్నారు.
  • అత్యవసర సర్వీసులు కాబట్టే ఎస్మా ప్రయోగం ఎస్మా అనేది అత్యవసర సర్వీసుల ఇంపార్టెన్స్ చెప్పడానికి రూపొందించిందన్నారు. అంగన్ వాడీ సర్వీసులు అత్యవసర సర్వీసులు కాదా.. గర్భీణులకు,చిన్నపిల్లలకు రేషన్,పౌష్టికాహారం సరఫరా చేయాలన్నారు. అంగన్ వాడి సమ్మె ప్రారంభమై ఎన్ని రోజులైంది. ఎన్ని రోజులు నడవనివ్వాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • డిమాండ్ల బరువు మోయలేం
    సమ్మె కారణంగా అంగన్వాడీ లు రోడ్లపైకి వచ్చారని…పిల్లలు,గర్బిణులు ఆకలితో అలమంటించాల్సి వస్తుందని విమర్శించారు.అంగన్వాడీ ల 11 డిమాండ్లతో వస్తే దాదాపు పది వరకు తీర్చడం జరిగిందన్నారు. ఒకటి రెండు అంశాలలో ఆర్దికపరమైనది. అది కూడా గతంలో ఇచ్చిన హామీని ఎప్పుడో పూర్తి చేశాం. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది రాగానే అమలు చేశామన్నారు. తెలంగాణ లో ఇప్పుడు ఇస్తున్న ప్రకారంగా ఇవ్వాలని అంటున్నారు…ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చూస్తామనే చెప్పామని స్పష్టం చేశారు. అంగనవాడిలు ఇప్పుడే కావాలని అంటున్నారని, ఆ బరువు ఇప్పుడు మొయలేమని వెల్లదించారు.

రాయుడు విషయంలో రీజన్స్ తెలిశాక స్పందిస్తాం.
అంబటి రాయుడు కొద్దిరోజుల క్రితమే పార్టీలో చేరారు. ఆయన ఏ రీజన్ తో వచ్చారో…దేనికి రాజీనామా చేశారనేది కూడా తెలియదు. ట్వీట్ ఇచ్చారని అంటున్నారు. అసలు ఆయన ఏమన్నారనేది చూసినట్లయితే కొద్దికాలంపాటు దూరంగా ఉంటానని తెలిపారు. రీజన్స్ తెలియాలి. తెలిశాక స్పందిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *