fbpx

ఆన్లైన్ వారియర్స్ రెడీ

Share the content

ఎన్నికల సీజన్ మొదలయ్యే కొద్దీ సర్వేల హడావుడి రకరకాల స్ట్రాటజిస్టుల హవా మామూలే. ప్రతి పార్టీకి సొంత స్ట్రాటజిస్టులు అలాగే కొన్ని పెయిడ్ ప్రమోషన్లతో పాటు తమ పార్టీకి అనుకూలంగా వివిధ రకాల ప్రచారాలు చేసుకోవడం చాలా మామూలే. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వీటి హవా డబుల్ కంటే త్రిబుల్ అయ్యేలా కనిపిస్తోంది. పూర్తిగా ఓటరు దేనిని నమ్మాలి దేనిని నమ్మకూడదు అని తికమక చేసే విధంగా అన్ని పార్టీలు ఈసారి పావులు కదుపుతున్నాయి. తమకు అనుకూలంగా ఎప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో రకరకాల వ్యక్తులను రంగంలోకి దింపి పూర్తిస్థాయిలో ఎన్నికల హడావిడి మొదలు పెట్టే పనిలో పడ్డాయి. మరోపక్క ఇప్పటివరకు కాస్త అనుకూలంగా లేదా న్యూట్రల్ లెవెల్లో జర్నలిజం చేస్తున్న వారిని సైతం తమకు అనుకూలంగా తిప్పుకొని పూర్తిస్థాయిలో తమ పార్టీకి బలం పెరిగింది అని చెప్పుకునే వ్యూహాలను పార్టీలు వేగంగా అమలు చేస్తున్నాయి. ప్రతి పార్టీ దీనికోసం పక్కాగా కొంత ప్యాకేజీని ఇప్పటికే పక్కన పెట్టాయి. స్ట్రాటజిస్టులు కూడా ఇప్పటికే రకరకాలుగా తమ ప్రచారాలను మొదలుపెట్టారు. తెలుగుదేశంతోపాటు వైసీపీ సైతం ఎన్నారై ఫండింగ్ ను భారీగా దీని కోసం ఖర్చు పెట్టేందుకు ప్రత్యేకంగా బృందాలను దింపేందుకు సమాయత్తమయ్యాయి. ఎన్నారై ఫండింగ్ కోసం జనసేన పార్టీ కూడా ఇప్పటికే వేట మొదలు పెట్టింది. జనసేన తరఫున ఈ బాధ్యతను నాగబాబు తీసుకుంటున్నారు. పార్టీ ఫైనాన్షియల్ పరిస్థితిని వివరిస్తూ కచ్చితంగా కొత్త మార్పు రావాలంటే జనసేన పార్టీకి విరివిగా సహాయం చేయాలని ఉన్నంతలో పార్టీ కోసం కష్టపడాలని ఆయన స్వయంగా క్యాంపెను మొదలుపెట్టారు. ఇప్పటికే అరబ్ దేశాల్లో ఈ క్యాంపెయిన్ పూర్తికాగా మరికొద్ది రోజుల్లో నాగబాబు స్వయంగా రంగంలోకి దిగి ఐరోపా దేశాలను చుట్టి రానున్నారు.

లోకేష్… భార్గవ్

ప్రచార క్యాంపెయిన్ బాధితులను అధికార పార్టీ తరఫున సజ్జన రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి స్వయంగా చూసుకుంటున్నారు. ఆన్లైన్ వేదికగా ఈసారి ప్రచారం చాలా కీలకము కావడంతో భార్గవ్ రెడ్డి సేవలను వైఎస్ఆర్సిపి అధికారికంగా ఉపయోగించుకోనుంది. ఇప్పటికే ఆయన రిక్రూట్మెంట్స్ కూడా మొదలుపెట్టారు. ఐప్యాక్ టీములు ఆయనకు అదనపు బలం. ఇక ప్రతిపక్షం తెలుగుదేశం నుంచి ఆన్లైన్ వేదిక ప్రచార బాధ్యతను స్వయంగా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఫండింగ్ విషయాలతో పాటు ఆన్లైన్ క్యాంపెయిన్ అలాగే టీమ్లు రిక్రూట్మెంట్ బాధ్యతలను లోకేష్ స్వయంగా చూసుకుంటున్నారు. దీనికోసం ప్రతి రోజు ఓ గంట సమయాన్ని కేటాయించి సమీక్షలు చేస్తున్నారు. ఏ విషయాన్ని హైలెట్ చేయాలి.. ప్రత్యర్థులను ఎలా ఇరుకుని పెట్టాలి.. ఆన్లైన్లో జరిగే ప్రచారాన్ని ఎలా తిప్పుకొట్టాలి అనే అంశాలను ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున అనుకూలంగా బలంగా వాయిస్ వినిపించేందుకు పార్టీ తరఫున బలమైన ప్రచారం చేసేందుకు అవసరమైన వ్యక్తులను కూడా ఇప్పటికే మాట్లాడారు. ఆన్లైన్లో బలంగా ఉండేవారు న్యూట్రల్ గా ఉండేవారు ఇప్పుడిప్పుడే వారి ఆలోచనలకు పార్టీలు తరఫున పదును పెట్టే అవకాశాలు ప్యాకేజీలు పొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆన్లైన్ వేదికగా భారీ స్థాయి యుద్దాలు ఉండే అవకాశాలు లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *