fbpx

వైసీపీ కార్యకర్తగా మేధావి వర్మ

Share the content

రాంగోపాల్ వర్మను పార్టీలకు అలాగే కులాలకు ప్రాంతాలకు అతీతంగా అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఉన్నప్పటికీ ఆయన చెప్పే ఫిలాసఫీలుకు చాలామంది అభిమానులు ఉన్నారు. బాగా చదువుకున్న యువత కూడా ఆయన మాటలకు లాజిక్ ఉన్న ఆయన వాదనకు జై కొట్టేవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ తీరు ఆయన వ్యవహర శైలి చూసి అలాగే ఒక రాజకీయ పార్టీకి పూర్తి అనుకూలంగా ఆయన పెడుతున్న పోస్టులు చూసి ఆయన అభిమానులు అలాగే ఆయనకు ఇప్పటివరకు మద్దతు ఇచ్చిన వారు కూడా దూరం అవుతున్నారు. ఇలాంటి వర్మను మేము ఎప్పుడు ప్రేమించలేదు అంటూ అభిమానులు బహిరంగంగా చెప్పడం విశేషం. వాదన విషయంలో కానీ లాజిక్ మాట్లాడే విషయంలో గానీ వర్మకు సాటి మరి ఎవరు ఉండరు. వాస్తవంగా ఉన్న పరిస్థితులను చక్కగా వివరించడంలో వర్మకు మరెవరు పోటీ కూడా ఉండరు. అలాంటి వర్మ ఇప్పుడు పూర్తిగా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా మారి చేస్తున్న హడావిడి ఆయన ఫిలాసిటీని ప్రేమించే వారికి ఇప్పుడు ఇబ్బందిగా మారింది.

** ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిసి వచ్చిన దగ్గరనుంచి రాంగోపాల్ వర్మ వ్యవహార శైలి పూర్తిగా మారింది. వ్యూహం చిత్రం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన పూర్తిగా వైసిపి కార్యకర్తగా మారి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు జాతీయస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను వ్యక్తిగతంగా సంపాదించుకున్న వర్మ ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అన్న మాటలను మూట కట్టుకుంటున్నారు. ఎంత వైసిపి ప్యాకేజీ ఇస్తే మాత్రం వారికి అనుకూలంగా అత్యంత దారుణంగా వర్మ మారిపోయాడు అని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం కోడైకూస్తోంది. వరుస ఫ్లాపుల తర్వాత పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వర్మ పరిస్థితిని గమనించి అలాగే వర్మ చెప్పే మాటలను కచ్చితంగా యువత ఆసక్తిగా వింటారు అన్న విషయాన్ని తెలుసుకున్న వైసీపీ అధినాయకత్వం వర్మను రంగంలోకి దింపింది. ఆయన లాజిక్కులను మ్యాజిక్కులను కచ్చితంగా యువత ఫాలో అవుతుందని భావించి ఏకంగా వర్మతో సినిమాను సైతం ప్లాన్ చేశారు. అయితే దీనికి పూర్తి స్పాన్సర్ వైసిపి అనే విషయం బయటకు వచ్చిన దగ్గరనుంచి వర్మ డైరెక్ట్ గా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసి ట్విట్టర్లో పోస్టులు పెట్టడం అలాగే… వారిని అనేక రకాలుగా తిట్టడం వంటి విషయాలు సగటు వర్మ అభిమానులకు సైతం నచ్చడం లేదు. వర్మ బాగా దిగజారిపోయి మరి రాజకీయ కార్యకర్తగా మారిపోయారని.. రాజకీయాలు తనకు ఇష్టం లేదని చెబుతూనే మరోపక్క వైసీపీకి పూర్తిగా అమ్ముడుపోయారు అని ప్రచారం జోరుగా జరుగుతుంది. దీంతో వర్మ తెచ్చుకున్న మేధావి తరహా ఇమేజ్ ఆయనే చేజేతులా పూర్తిగా కాలరాసుకున్నట్లు అయింది. ప్రతిసారి తన మాటను ఎప్పుడు నిలబెట్టుకొని వర్మ… ఇప్పుడు కూడా మరోసారి వేరే రాజకీయ పార్టీకు అమ్ముడుపోయి ప్రచారం చేసిన ఆది పెద్ద ఆశ్చర్యం కలగజేయదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *