fbpx

జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన…ప్రభుత్వ వైఫల్యాలే టిడిపి గెలుపుకు బాటలు : వనమూడి

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, ప్రభుత్వ వైఫల్యాలే తెలుగుదేశం పార్టీ గెలుపుకు బాటలు కానున్నాయని మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు తెలిపారు. ఈ నెల జనవరి 10 వ తేదిన తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొనబోయే “రా కదలి రా” బహిరంగసభకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఆదివారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వ దుర్మార్గపు విధానాలకు అన్ని వర్గాల ప్రజలు విసిగి పోయారని విమర్శించారు. ఓటమి భయంతో వైసిపి నాయకుల పేటీఎం బ్యాచ్ అప్పుడే చీప్ ట్రిక్స్ మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు.వైసీపీ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, పన్నినా ప్రజలంతా తెలుగుదేశం వైపు ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

రా. కదలిరా సభను విజయవంతం చేయాలి

ఈ నెల జనవరి 10 వ తేదీన తుని నియోజకవర్గంలో జరగబోయే కాకినాడ పార్లమెంట్ స్థాయి రా. కదిలిరా బహిరంగసభకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొని సభను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గ పరిశీలకులు అయితాబత్తుల ఆనందరావు, నాగిడి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైకాపాలో మొదలైన తిరుగుబాట్లు, అసంతృప్తి జ్వాలల్లో ఆ పార్టీ పూర్తిగా కాలి బూడిద కావడం ఖాయమని తెలిపారు. జగన్ అరాచక విధానాలకు సొంత చెల్లి, తల్లి చీకొట్టడంతో ..జగన్ ను నమ్మి వెంట నడిచిన నాయకులంతా జారిపోతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డిని, కాకినాడలో దోపిడీ పాలన సాగిస్తున్న ద్వారంపూడిని తరిమి కొట్టడానికి ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తాజద్దీన్, గదుల సాయిబాబా, దండిప్రోలు నాగబాబు, తుమ్మల రమేష్, గుజ్జు బాబు, అంబటి చిన్నా, ఒమ్మి బాలాజీ, సీకోటి అప్పలకొండ, కొల్లు కుమారి, రిక్కా లక్ష్మి, మెంటారావు, గాది శివ, గుత్తుల రమణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *