fbpx

కొరకరాని కొయ్యగా పురందరేశ్వరి

Share the content

బిజెపి అధ్యక్షురాలుగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించిన తరువాత వైసిపి పై నేరుగా దాడి చేయడం.. వైసిపి నేతలను దీటుగా ఎదుర్కోవడంతో ఇప్పుడు వైసిపి అధిష్టానం పెద్దలు బిజెపి రాష్ట్ర నాయకత్వం పైన.. ముఖ్యంగా పురందరేశ్వరి తీరుపైన తిట్ల దండకం అందుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు బిజెపితో ఎలాంటి సమస్య లేదని కేంద్ర నాయకత్వం దగ్గర పూర్తిస్థాయిలో తమకు పరపతి ఉందని భావించిన నేతలు ఒక్కసారిగా పురందరేశ్వరి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె చర్యల పట్ల తీవ్ర అసహనం తో కనిపిస్తున్నారు. మద్యం కుంభకోణం మీద క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి తర్వాత ఏకంగా హోం మంత్రి అమిత్ షాక్ సైతం సీబీఐ విచారణ జరిపించాలని పురందరేశ్వరి కోరడం వైసిపి నేతల తీవ్ర కోపానికి కారణమైంది. ముఖ్యంగా వైసీపీలో నెంబర్ 2 పోసిషన్ లో ఉన్న విజయ సాయి రెడ్డి మీద పురందరేశ్వరి ఆరోపణలు చేయడం ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం మద్యం కుంభకోణంలో ఉందని ఫిర్యాదు చేయడం విశేషం. అక్కడితో ఆగకుండా తర్వాత ఇసుక విషయంలోనూ పురందరేశ్వరి కొన్ని ఆరోపణలు చేశారు. ఇసుక కుంభకోణం కూడా ఆంధ్రాలో చాలా భారీగా జరిగిందని వెంటనే కేంద్రం దీనిపై దృష్టి సారించాలని ఆమె కోరారు. తాజాగా పురందరేశ్వరి ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తూ బెయిల్ పై పది సంవత్సరాలుగా బయట ఉన్న విజయ్ సాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అన్ని కేసుల్లోనూ సాక్షులను ప్రభావితం చేశారని, ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసి చెప్పినట్లు చేసుకున్నారని 10 సంవత్సరాలుగా ఎలాంటి విచారణ లేకుండా కేసులకు అడ్డుపడుతున్నారని లేఖ రాయడం ఇప్పుడు వైసీపీ కీలక నేతలకు మరింత కోపానికి కారణమైంది. పురందరేశ్వరి సూటిగా సుత్తి లేకుండా వైసిపి నేతల మీద, వ్యవస్థలను వారు నిర్వీర్యం చేస్తున్న తీరు, అవినీతి వ్యవహారాలు, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న తీరు మీద ఒక్కో బాణం ఎక్కు పెడుతుంటే వైసీపీ నేతలకు ఎక్కడో తగులుతోంది. ఫలితంగా విజయసాయిరెడ్డి పురందరేశ్వరి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నేరుగా పురందరేశ్వరి వ్యక్తిగత వ్యవహారాలను బయటకు తీస్తామంటూ చెప్పడం… రకరకాల అవినీతి ఆరోపణలు ఆమెకు అంటగట్టడం చూస్తుంటే వైసీపీ నేతల కోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

** పురందరేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత కచ్చితంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా దీటుగా ఆమె పని చేస్తారు అని అంతా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా పురందరేశ్వరి వైసీపీ నేతలు టార్గెట్ చేయడం వారి మీద పదేపదే ఆరోపణలు చేయడంతో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వైసీపీ నేతలు కనిపిస్తున్నారు. పురందరేశ్వరి తమకు అనుకూలంగా వ్యవహరిస్తారు అని వైసిపి నేతలు భావిస్తే దానికి భిన్నంగా ఆమె వ్యవహరిస్తున్న తీరు అలాగే ఆధార సహితంగా వైసిపి నేతల అక్రమాలను బయటపెడుతున్న తీరు ఇప్పుడు వారిని భయం లోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద అలాగే వైసిపి నెంబర్ టు విజయసాయిరెడ్డి మీద ఆమె గురిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వైసీపీ వచ్చే ఎన్నికల్లో కనుక ఓడిపోతే పురందరేశ్వరి లేవనెత్తిన ప్రతి అంశానికి అలాగే ప్రతి ఫిర్యాదుకు కూడా పూర్తిస్థాయిలో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వం మారితే కనుక పురందరేశ్వరి ఫిర్యాదుల మేరకు సిబిఐ చేత కేసులు నమోదు చేయించడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. కేంద్రంలో బిజెపి కనుక విజయం సాధిస్తే పురంధరేశ్వరి తాను లేవనెత్తిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి వైసిపి నేతల మీద వరుసకేసుడు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు పురందరేశ్వరుని ప్రాథమికంగా ఎలాగైనా దెబ్బకొట్టేందుకు వైసిపి రకరకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *