fbpx

గడపగడపకు ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ..

Share the content

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరుపై నాలుగేళ్ల వైసిపి పాలనపట్ల ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వైసిపి ప్రభుత్వం ప్రారంభించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వెళుతున్న ఎమ్మెల్యేలకు వ్యతిరేకత సెగలు తగులుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలో గడపగడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు అభివృద్ధి పై నిలదీస్తున్నారు. ప్రజల ముందుకు వెళుతున్న ఎమ్మెల్యేలకు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు తెల్ల మొఖం వేస్తున్నారు. సంక్షేమ పథకాల పంపిణీలో భాగంగా ప్రజల ఖాతాలో పడుతున్న డబ్బులకు మాత్రం లెక్కలు చెప్పి వెను తిరుగుతున్నారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు.

మా గోడు వినండి సార్..

ముఖ్యంగా గడపగడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలకు ప్రధానంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇళ్ల నిర్మాణం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తాం అంటూ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటపై నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు. సొంతంగా ఇల్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకులోన్ ఇప్పిస్తాం ఇల్లు కట్టుకోండి అని చెప్పడంపై ప్రజలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైఅభివృద్ధిపై ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఈ సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకువేలాల్సిందిగ జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేలు మొర పెట్టుకుంటున్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పై పూర్తీ క్లారిటీ ఇవ్వాల్సిందిగ కోరుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర రవాణశేఖ మంత్రి జిల్లా ఇంచార్జ్ పినిపే విశ్వరూప్ ఎదుట ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు మిన్నకుండిపోతున్నామ్ అని ముఖ్యంగ సమాజిక పింఛన్లు తొలగించడం పై ప్రభుత్వం పై ప్రజలు పూర్తి వ్యతిరేకత ఎదురవుతుంది అంటూ తెలిపారు. దీనిపై అధిష్టానంతో మాట్లాడతానని మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యేలకు సర్ది చెప్పారు.

అవకాశంగా తీసుకుంటున్న ప్రతిపక్షాలు…

ప్రజలలో వైసిపి ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతూ సమస్యలపై పోరాడుతూ అటు జనసేన పార్టీ ఇటు టిడిపి పార్టీలో పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై అభివృద్ధిపై అధికార పార్టీని నిలదీస్తున్నారు. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలో ఉన్న టిడిపి ఇదేమీ ఖర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమం ద్వారా అనునిత్యం ప్రజల్లో వుంటూ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ మరొక అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరుతున్నారు. ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందని ప్రజలు ప్రతిపక్ష పార్టీ పార్టీ వైపు అనుకూలంగా ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *