fbpx

చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత మారిన సీన్!.

Share the content

చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష పొత్తుల అంశం మీద పూర్తి అస్పష్టత కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు కచ్చితంగా పొత్తులు ఉంటాయి అనుకున్న తరుణంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ పూర్తిగా రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఏం జరిగింది అన్నది కూడా చాలా రహస్యంగా ఉంచారు. ఈనాడు అనుకూలమైన మీడియాలో సైతం చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందా అసలు అక్కడ ఏం జరిగింది అన్నది కూడా బయటికి రాలేదు. అయితే దీని తర్వాత విపక్ష పార్టీల నేతల వైఖరిలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

ఒంటరి పోరుకేనా?

చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఖరిలో మాటలో మార్పు వచ్చింది. కచ్చితంగా ముఖ్యమంత్రి తాను అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నారు. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా తెలుగుదేశంతో పొత్తు ఇంకా ఏమి ఖరారు కాలేదని చెప్పకనే చెప్పారు. నిన్న మొన్నటి వరకు కచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయాలను ఇవ్వను అని బలంగా చెప్పిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత కేంద్రం పెద్దల ఆదేశాల మేరకు ఇలా మాట్లాడుతున్నారు అన్న వాదన లేకపోలేదు. చంద్రబాబు ఢిల్లీ టూర్ అనంతరం విశాఖలో అమిత్ షా పర్యటనలో కూడా నేరుగా జగన్ ప్రభుత్వం మీద బలంగా మాట్లాడారు. మరోపక్క చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత పూర్తిగా చంద్రబాబు మాట ఎక్కడ ఒత్తులు మీద మాట్లాడడం లేదు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ అయితే టిడిపి ప్రభుత్వంలో చేసే పనులు పై హామీలు కూడా ఇస్తున్నారు. చంద్రబాబు పొత్తుల విషయం పూర్తిస్థాయిలో చూసుకుంటామని చెబుతున్నప్పటికీ, ఆయన వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దాదాపుగా కేంద్ర పెద్దలు కచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, జనసేనకు తగిన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని చంద్రబాబుకు చెప్పినట్లు ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎవరి మాట వినే పరిస్థితి ఉండదని, అందులోనూ బీజేపీ పెద్దలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని బలంగా చెప్పడంతో పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఇప్పుడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాం అని సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు సైతం కేంద్రం పెద్దలు చెప్పిన విషయాలను తమ సామాజిక వర్గం పెద్దలకు చెప్పి వారి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఇవ్వకూడదని చిన్న పార్టీకి కోరి నన్ను సీట్లు ఎలా ఇస్తామని తెలుగుదేశం పెద్దలు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై పీఠముడి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *