fbpx

మంచు ఫ్యామిలీ లో రాజకీయా చిచ్చు

Share the content

సినీ ఇండస్ట్రీలో తమదైన గుర్తింపు తెచ్చుకున్న మంచు ఫ్యామిలీలో రాజకీయ రచ్చ ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ టిడిపి కండువా కప్పుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దానికోసం టిడిపి అధినేత చంద్రబాబును మంచు మనోజ్ కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంచు మనోజ్ భూమా అఖిలప్రియ చెల్లెలు మౌనికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. టిడిపికి భూమాన కుటుంబానికి ఎంతో కాలంగా రాజకీయ సంబంధాలు కొనసాగుతున్నాయి.అదే సంబంధాన్ని ఇప్పుడు మంచు మనోజ్ కూడా కొనసాగిస్తు తన కెరియర్ ను రాజకీయం వైపు మళ్లించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అన్నదమ్ముల మధ్య రాజకీయ చిచ్చు…

మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి వైసిపి కుటుంబానికి బంధువు రాజకీయంగా తమకు తమ విద్యాసంస్థలకు అండ కోసం 2019 ఎన్నికల్లో మంచు మోహన్ బాబు మంచు విష్ణు వైసీపీ తరఫున ప్రచారం చేశారు. తర్వాత అనుకున్న విధంగానే మంచు విష్ణు కి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికల్లో నిలబడినప్పుడు వైసీపీ మద్దతు తెలిపింది. మంచు విష్ణు విజయానికి పరోక్షంగా సహాయం చేసిందనే వార్తలు కూడా గుప్పుమనాయి. అప్పటినుండి వైసిపికి సానుభూతిపరులుగా మంచి ఫ్యామిలీ వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు మంచు మనోజ్ భూమా మౌనిక వివాహం తర్వాత టీడీపీలోకి వెళ్తున్నారు అనే వార్తలు వినిపించడంతో ఫ్యామిలీలో రాజకీయరగడ మొదలైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆర్థిక విషయాల్లో మంచు మనోజ్ విష్ణు మధ్య జరిగిన గొడవ ఒకటి ఇటీవల సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. అప్పటి నుండి అన్నదమ్ములు ఇద్దరూ ఎడ మొహం పెడ మొహం గా ఉంటున్నారు. మనోజ్ మౌనికల వివాహ విషయంలో కూడా విష్ణు వ్యతిరేకంగా ఉన్నారన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు మనోజ్ టిడిపిలోకి వెళ్తున్నారని అన్నదమ్ములు ఇద్దరు ప్రత్యర్థుల పార్టీలో ఉండటం వారి గొడవకు మరింత ఆద్యం కోసే విధంగా ఉంది. ఒకప్పుడు టిడిపిలో కీలక నేతగా హవా చాటిన మంచు మోహన్ బాబు పార్టీ పైన వ్యతిరేకతో పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కుమారుడు మనోజ్ టిడిపిలోకి వెళ్లడాన్ని మోహన్ బాబు ఆహ్వానిస్తారా లేదా అనే విషయం వేచి చూడాలి. ఏది ఎలా ఉన్నా తను మాత్రం పెళ్లి తర్వాత చంద్రబాబు ఆశీర్వచనాల కోసమే తనను కలిశానంటూ మంచు మనోజ్ తెలియజేస్తున్న రాజకీయ వర్గాల్లో మాత్రం మంచు మనోజ్ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *