fbpx

పది రోజులు పవన్ టెన్షన్ తప్పదు

Share the content

విశాఖపట్నంలో వారాహి విజయ యాత్రకు అనూహ్యస్పందన లభించింది. ముఖ్యంగా విశాఖ వాసులు పవన్ కళ్యాణ్ ను ఎందుకు అక్కున చేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత విశాఖ వాసులు ఆయన మీద మరింత ప్రేమ పెంచుకున్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా జగదాంబ జంక్షన్ లో వారాహి విజయ యాత్ర ద్వారా నిన్న జరిగిన సభలో పూర్తిస్థాయి జనం వచ్చి ఉంటే పరిస్థితి భయానకంగా ఉండేదని పోలీసు అధికారులు చెప్పడం విశేషం. అత్యంత చిన్న కూడలిగా ఉన్న జగదాంబ జంక్షన్ విశాఖలోనే ప్రత్యేకమైన కూడలి. ఇక్కడ సందులు ఇరుకుగానే ఉంటాయి. ప్రదేశం కూడా ఇరుకు గానే ఉంటుంది. వారాహి యాత్రలో రోడ్డు పక్కన ప్రత్యేకంగా బారికెట్లు వేసి వారాహి వాహనాన్ని నిలిపి అక్కడ నుంచి పవన్ ప్రసంగించేలా చూశారు. రోడ్డుపై నలువైపులా జనం ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ జన సందోహాన్ని అదుపు చేయడం పోలీసులు వల్ల కూడా కాలేదు. పవన్ కళ్యాణ్ సభ అంటే భారీగా జనం వచ్చే అవకాశం ఉందని ముందుగానే గుర్తించిన పోలీసులు వచ్చే జనాన్ని నిలువరించారు. జగదాంబ జంక్షన్ కు వచ్చే దారులన్నీ మూసేసిన సరే చిన్న చిన్న దారుల్లో నుంచి జనం రావడం పవన్ ప్రత్యేకతను చాటుకుంది. పవన్ కళ్యాణ్ సభ కోసం, ఆయన చెప్పే మాటలు వినడం కోసం యువత ఎక్కువగా స్పందిస్తే ఈసారి మహిళలు అలాగే పెద్దలు కూడా సభకు రావడం కనిపించింది. దీంతో విశాఖ వేదికగా జగన్ పవన్ మధ్య వచ్చే ఎన్నికల్లో భారీ పోటాపోటీ యుద్ధం తప్పదని తెలుస్తోంది. అక్టోబర్ లో ముఖ్యమంత్రి జగన్ విశాఖకు మాకం మారిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే విశాఖపట్నం ప్రాంతానికి రావాలని బలంగా కోరుకుంటున్నట్లు మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి విశాఖకు వస్తే విశాఖలో మరింత దారుణంగా పరిస్థితి తయారవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ వెతలకు తోడు, వైసిపి అగ్రనాయకులు కూడా ఇక్కడే నివాసాలు ఏర్పరచుకొని ఉంటే విశాఖలో మొత్తం వాతావరణం మారిపోయే అవకాశం ఉంటుందని విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారాహి విజయ యాత్ర ద్వారా పవన్ కూడా విశాఖలో స్థలం చూసుకొని ఇల్లు కట్టుకుంటానని చెప్పడం ద్వారా జగన్ ప్రత్యక్షంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చినట్లు అయింది. గత ఎన్నికల్లో విశాఖలోని గాజువాక నుంచి ఓడిపోయిన పవన్ విశాఖ వాసులు ఎన్నికల అనంతరం పశ్చాత్తాపానికి గురి అయి కచ్చితంగా ఆయనను గెలిపించుకోవాలన్న ఆదరాభిమానాలను ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం వారాహి విజయ యాత్ర సభ ద్వారా తెలుస్తోంది. విజయయాత్ర సభకు వచ్చిన జనాలను చూసి పోలీసులను నివ్వేర పోయారు. భారీగా జనాలు వస్తారు అని తెలుసుగాని పోలీసుల భారీ కేట్లను తోసుకొని మరి రావడం, పోలీసులు సైతం ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయారు.

పది రోజులు భయం

వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ పది రోజులు పాటు విశాఖలో ఉండనున్నారు. నిన్న బహిరంగ సభ నిన్నటితో అయిపోతే, మరో బహిరంగ సభ మాత్రమే యాత్రలో ఉండనుంది. మిగిలిన రోజులు ఆయన క్షేత్ర పర్యటనలు అలాగే గతంలో మిగిలిపోయిన జనవాణి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. దీంతో పోలీసులకు ఇప్పుడు టెన్షన్ వాతావరణం పెరిగిపోతోంది. తాడేపల్లి నుంచి వచ్చే ఆదేశాలను పాటించలేక పవన్ ను నిలువరించలేక పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జనసేన బృందంతో మాట్లాడుతున్నట్లు సమాచారం. రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. పోలీసులు పవన్ ను బయటకు రానీయకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు పోలీసులు పవన్ హోటల్ దాటనీయకుండా చూసిన పరిస్థితులు ప్రస్తుతానికి కనిపించడం లేదు. పోలీసులు ఒకవేళ అడ్డుకుంటే దానికి దీటుగా పవన్ కళ్యాణ్ స్పందిస్తే విశాఖలో రణరంగమే జరుగుతుంది. దీనిని పోలీసులు గుర్తించి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కదలికలను గమనిస్తూ ఎప్పటికప్పుడు అంచనాలకు వస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను పాటించడమే కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజువేసి పోలీసులు ముందుకు కదలాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు పోలీసులకు వారాహి టూర్ పెద్ద తలనొప్పిగానే మారిందని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *