fbpx

వైసీపీ క్షేత్ర స్థాయి ప్లాన్

Share the content

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే వైఎస్ఆర్సిపి టీడీపీ మీద పట్టు బిగిస్తోంది. ఒకవైపు ఐటీ కేసులతో నోటీసులు అందుకని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు మీద సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్స్ చేపిస్తున్న వైసీపీ అదే స్థాయిలో లోకేష్ పాదయాత్ర మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. లోకేష్ పాదయాత్ర లో అలజడి సృష్టించడం ద్వారా, ఎదురు కేసులో పెట్టించడం ద్వారా కొత్త రకమైన గేమ్ ప్లాన్ కు తెరతీసింది. దీంతో ఇప్పుడు రాబోయే కాలంలో మరిన్ని రాజకీయ ఎత్తులు వైసీపీ వేసేందుకు పావులు కదుపుతోంది.

వైసిపి వేసే ఎత్తులు టిడిపికి అనుకూలంగా పనిచేస్తాయి వ్యతిరేకంగా పనిచేస్తాయి అన్నదే కీలకం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ సంస్థ షాఫుర్ పల్లోంజీ వద్ద ముడుపులు అందుకున్నారు అన్నది చాలా కీలకమైన అంశం. ఐటీ సోదలో చంద్రబాబు నాయుడు పేరుమీద ప్రాథమిక సాక్షాదారాలు లభించడంతో దీని మీద సమాధానం చెప్పాలని ఐటీ ఇప్పటికి నోటీసులు జారీ చేసింది. ఒకపక్క న్యాయపరమైన సహాయం తీసుకుంటున్న సమయంలోనే మరోపక్క లోకేష్ పాదయాత్ర లో అలజడి సృష్టించడానికి వైసిపి ప్రయత్నించడం వెనుక బలమైన కారణం ఉంది. రాజకీయంగా టిడిపిని పూర్తిస్థాయిలో భయపెట్టి, పార్టీ నేతలను కార్యకర్తలను సైతం కలవర పెట్టాలని వైసీపీ భావిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో బూత్ స్థాయి రాజకీయాలు చేయాలి అంటే భయపడే పరిస్థితిని తీసుకువస్తోంది. వచ్చే ఎన్నికలు చాలా కీలకంగా జరగనున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయి నాయకులే దీనిలో ప్రధాన భూమిక పోషించనున్నారు. అందులోనూ అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో బూత్ స్థాయి నేతలను ఆర్థికంగా అంగ బలం ఉన్న వారిని పెట్టాలని యోచిస్తోంది. పూర్తిగా బూత్ స్థాయిని తమ ఆధీనంలోకి తీసుకునేవారు అయితేనే మంచి ప్రయోజనం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. గ్రామీణ స్థాయిలో పూర్తిస్థాయి మెజారిటీని నిరూపించుకోవాలి అంటే అలజడి సృష్టించడం బూత్ స్థాయిలో కచ్చితంగా బలమైన వ్యక్తులను పెట్టడమే సరైన పరిణామం అని అంచనా వేస్తున్న తరుణంలో.. విపక్ష పార్టీల తరఫున బూత్ స్థాయి రాజకీయాలు చేయడానికి కూడా భయపడే పరిస్థితిని తీసుకువచ్చే ప్లాన్ అమలు చేస్తోంది. ఒకపక్క వచ్చేది జగన్ ప్రభుత్వమే అని విపరీతమైన ప్రచారం చేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయి పోలింగ్ బూత్ స్థాయినిర్వహణలో పాలుపంచుకున్న వారికి కూడా సరైన హెచ్చరికలు జారీ చేయడం వైసీపీ అసలు ఉద్దేశం. అంటే వైసిపికి క్షేత్రస్థాయిలో అడ్డు లేకుండా చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నమే ఇది అని చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *