fbpx

“దివ్యాంగుల ఫించన్ ఆరువేలకు పెంచాలి”

Share the content

రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు జనసేన తోనే పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే పించనును ఆరు వేలకు పెంచాలంటూ ఆయన డిమాండ్ చేశారు. శనివారం కాకినాడ సిద్ధార్థ నగర్ లో జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ గతంలో వృద్ధులకు ఇచ్చే పింఛను జనవరి ఒకటి నుంచి వారికి 3వేలు ఇవ్వనుందన్నారు. ఐతే దివ్యాంగులకు ఇచ్చే మూడు వేల రూపాయలను ఆరు వేలకు పెంచాలని కోరారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్లో దివ్యాంగులు సమస్యల గురించి చర్చించకపోవడం దారుణన్నారు. ఎమ్మెల్యేలకు వందల కోట్లను దోచి పెట్టేందుకే సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ దివ్యాంగుల సమస్యలు పరిష్కారానికి మాత్రం మాట్లాడక పోవడం శోచనీయమని తెలిపారు.

దివ్యాంగుల సంఘం నగర అధ్యక్షుడు కర్రి ఆదినారాయణ మాట్లాడుతూ దివ్యాంగులను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సబ్సిడీ రుణాలు, ఇల్లు, 2016 హక్కుల చట్ట అమలు చేయాలన్నారు. దివ్యాంగుల పెళ్ళికానుకకు సంబంధించి ఉన్న నిబంధనను తొలగించి వారికి న్యాయం చేయాలని ఆదినారాయణ డిమాండ్ చేశారు. దివ్యాంగులకు పూర్తి న్యాయం జనసేన పార్టీ ద్వారానే జరుగుతుందని జనసేన నాయకులు చెప్పారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు వాసిరెడ్డి శివ, కర్రి శ్రీను, చోడిశెట్టి శ్రీమన్నారాయణ, వీరబాబు, సత్తిబాబు, ఆదినారాయణ, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *