fbpx

వైసిపి తీరుపై ప్రజల్లో భయం

Share the content

చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్ర ప్రజల ఆలోచన తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఇది వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు ఇస్తోంది. ముఖ్యంగా ఎవరైనా బయటపడితే వారిని కచ్చితంగా అరెస్టు చేస్తారు అన్న భయం ప్రజల్లో బలంగా ఉంది. ఇంటెలిజెన్స్ నివేదికలు సైతం ఇవే చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు వైసీపీ నేతల్లోనూ కొత్త భయం పట్టుకుంది. ఐదు సంవత్సరాలు పాటు వైసిపి ప్రజా వ్యతిరేకతతో పాటు ఇప్పుడు ప్రజలు సైతం ప్రభుత్వ పాలనలో భయపడే పరిస్థితులు రావడం కచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

** రాష్ట్రంలో సామాన్యులు సైతం గత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో బయట రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వారు తక్కువగా ఉంటే రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోయిన వారు ఎక్కువ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు సుమారుగా ఐదున్నర లక్షల గ్యాస్ కనెక్షన్లు వెళ్లిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. వైసిపి పాలనలో ఉపాధి కరువు అవడం ఉద్యోగాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అందులోనూ వైసీపీ పరిపాలనలో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు తప్పితే అభివృద్ధికి ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వలేదు అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్ష నాయకుడి మీద కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల వైసీపీ శ్రేణులకు బూస్టప్ ఇవ్వచ్చు కానీ తటస్థ ఓటర్లు మాత్రం ఈ చర్యను కచ్చితంగా ఖండిస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితే కచ్చితంగా వారిని జైలుకు పంపుతారు అన్న సంకేతాలు కూడా ప్రజల్లో బలంగా వెళ్లాయి. ఇది కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని వైసిపి నాయకులే చెబుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు తర్వాత మళ్లీ ఫైబర్ నెట్ కేసును పెట్టేందుకు వైసిపి సిద్ధం అవుతుండడం, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు కేసు కూడా ఇవన్నీ ముందుగానే ప్రజలకు తెలిసిపోవడంతో వైసిపికి ప్రజల్లో నెగిటివ్ మార్కులు పడుతున్నాయి. దీంతో వైసిపి నాయకులు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేక ప్రజల్లో తిరగలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు మీద పెడుతున్న కేసులు కూడా చాలా చిన్న కేసులు కావడంతో ఇవి కచ్చితంగా వైసీపీ ఆడుతున్న కక్షపూరిత ధోరణి కేసులని ప్రజల భావిస్తున్నారు. దీంతో వైసిపి చేస్తున్న ఈ తతంగమంతా పార్టీకి నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకొస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *