fbpx

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ :ఐ .వెంకటేశ్వరరావు

Share the content

పిడిఎఫ్ ఎమ్మెల్సీల అధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రూప్స్, డీఎస్సీ, సచివాలయ లకు సంబంధించి ఉచిత శిక్షణ అందిస్తామని గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ .వెంకటేశ్వరరావు తెలిపారు.ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం కాకినాడ లో అంబేడ్కర్ భవన్ నందు గ్రూప్స్ , డివైఈవో పోటీ పరీక్షలకు పిడిఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు సారథ్యంలో గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లో కేవలం 6000 టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేయడం దారుణమని పేర్కొన్నారు. డీఎస్సీ, గ్రూప్స్ నోటిఫికేషన్ లలో పోస్టులు పెంచాలని రేపటి నుండి జరిగే శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు “భారత సమాజం” ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణరావుచే రూపొందించబడిన భారత సమాజం అనే స్టడీ మెటీరియల్ ను ఉద్యోగార్థులకు ఉచితంగా అందించారు. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనే స్టడీ మెటీరియల్ ను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నా రాము, పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర వర్మ అవిష్కరించారు.ఈ అవగాహన సదస్సులో యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కె వి వి నగేష్, ప్రధానకార్యదర్శి టి రవి చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము , పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర వర్మ, జె వి వి జిల్లా అధ్యక్షులు కె.ఎం.ఎం. ఆర్ ప్రసాద్, సిఐటియూ నాయకులు పి వీరబాబు, ఎస్ ఎఫ్ ఐ నాయకులు ఎం జి సూరిబాబు, డివైఎఫ్ఐ నాయకులు పి డి ప్రసాద్ , యూటీఎఫ్ సహాద్యక్షులు వి వి రమణ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సీ హెచ్ సూరిబాబు, ఏ సీతారామరాజు, సీ హెచ్ వి రమణ, వరహాలు సుమారు 1000 మంది ఉద్యోగార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *