fbpx

పవన్ గొంతులో మారిన స్వరం

Share the content

నిన్న మొన్నటి వరకు వచ్చేది జనసేన ప్రభుత్వం అని డంకా భజాయించి చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది అని చెప్పారు. నిన్న మొన్నటివరకు కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని గంటాపథంగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీకి డేంజర్ బెల్స్ పంపినట్లేనని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఎన్డీఏ కూటమిలో లేని తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో కలుపుకు వెళ్లడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని, 2024 కి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అమీతుమీ కి సిద్ధపడాలని, దీనివల్ల వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ పొత్తు కోసం జనసేన బిజెపిల వద్దకు రావాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ కు స్పష్టంగా కేంద్ర పెద్దలు చెప్పడంతోనే పవన్ కళ్యాణ్ స్వరంలో మార్పు కనిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

టీడీపీ కచ్చితంగా తగ్గుతుంది

పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బిజెపిని కలుపుకొని వెళ్తేనే జగన్ ను బలంగా ఢీకొట్టగలమని ఆయన భావిస్తున్నారు. దీంతో పదే పదే ఖచ్చితంగా మూడు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయని చెప్పకనే చెబుతున్నారు. అయితే ఢిల్లీ పర్యటన తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ వేరే విధంగా స్పందించారు. వచ్చేది ఎన్డీఏ కూటమి పరిపాలన అని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీతో తాము కలిసి ప్రసక్తి లేదని పరోక్షంగా చెప్పినట్లే అయింది. అయితే ఇది కూడా ఒక రకమైన రాజకీయమైన గేమ్ అనేది నిపుణుల మాట. వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై ఎన్నికలుగా భావిస్తున్నారు. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండాలంటే 2024 ఎన్నికలు కచ్చితంగా గెలుపొందాలి. ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబుకు వయసు పై పడుతుండడం దానికి తగినట్లుగా టిడిపి కూడా బలహీనపడుతుండడం వంటి అంశాలను నిశితంగా గమనిస్తున్న బిజెపి జనసేన ను తొందరపాటుకు గురికా వద్దని సూచించినట్లు సమాచారం. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాళ్ల వద్దకు వస్తుందని, ఎక్కువ సీట్లకు డిమాండ్ చేస్తే కచ్చితంగా ఒప్పుకునేందుకు కూడా టిడిపి సిద్ధంగా ఉంది అన్నది బిజెపి నేతల మాట. ముందుగానే టిడిపిని పూర్తిస్థాయిలో పొత్తు లోకి ఆహ్వానిస్తే టిడిపి చెప్పే సీట్లకు మాత్రమే జనసేన బిజెపి పరిమితం కావలసి ఉంటుంది. అవసరం తెలుగుదేశం పార్టీది కావడంతో కచ్చితంగా పొత్తులు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని అయితే, జనసేన బిజెపి కూటమికి ఎక్కువ సీట్లు సాధించుకోవాలంటే ఇప్పటినుంచి చంద్రబాబును ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా మాట్లాడాలని చెప్పడం వల్లనే పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టమైన వ్యూహాన్ని జనసేనానిని చెప్పిన తర్వాతనే ఆయన మాటల్లో కొత్త రాగం అందుకుంది అని తెలుస్తోంది. అయితే జనసేన బిజెపి వద్దకు తెలుగుదేశం పార్టీ పొత్తుల గురించి వెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి. అలాకానిపక్షంలో తెలుగుదేశం పార్టీ వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే అది ఎంత మేర విజయం సాధిస్తుంది అన్నది కూడా అర్థం కాని ప్రశ్న. ఎప్పటికీ రాష్ట్ర రాజకీయాలను తన వైపు తిప్పుకున్న జనసేనతో పొత్తు ఉంటే టిడిపికి కచ్చితంగా లాభం చేకూరుతుంది. అలాకానిపక్షంలో టిడిపి నష్టపోతుంది అని బిజెపి అంచనా వేస్తుంది. అన్ని బేరేజు వేసుకొని చివరి క్షణంలో అయినా చంద్రబాబు తాము చెప్పిన సీట్లకు ఒప్పుకుంటారు అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేస్తే, కావలసిన సీట్లను కచ్చితంగా సాధించుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *