fbpx

పవన్ రాజకీయ ఎత్తుగడ సూపర్ !

Share the content

వాలంటీర్ల సేవలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు సాదాసీదాగా అనిపించడం లేదు. ఒక బలమైన వ్యూహంతోనే ఆయన చేస్తున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకి పూర్తి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉన్నందున వారి పనితీరును పూర్తిగా ప్రజలే ప్రశ్నించేలా ఆయన చైతన్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు వాలంటీర్లు ఏది ఇమ్మంటే అది ఇచ్చి వారికి పూర్తిగా సహకరించిన ప్రజలకు వారికి ఇస్తున్న సమాచారం ఎక్కడికి వెళుతుంది అన్న ప్రశ్న ఇప్పటికే ఉదయించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు చెప్పినట్లు వినే పరిస్థితి ప్రజలకు ఉండకూడదు అనే బలమైన సందేశం పవన్ కళ్యాణ్ జనంలోకి తీసుకు వెళ్తున్నారు అన్నది అయితే స్పష్టం అవుతుంది. ఒకేసారి వాలంటీర్ల మీద ఆయన పడడం వెనుక కూడా కీలకమైన విషయాలు దాగి ఉన్నాయి. బలమైన వ్యూహంతోనే ఆయన వాలంటీర్లపై కీలకమైన ఆరోపణలు చేశారు.

ప్రజలు మద్దతు… ఆడపిల్లల అంశం

ఆంధ్రప్రదేశ్లో భారీగా మహిళలు యువతులు అక్రమ రవాణా చేయడం వెనుక వాలంటీర్ల సమాచారం తీసుకోవడం కూడా కీలకమని చెప్పడం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచనను పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. మహిళల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ కీలకంగా ఉందని ఎక్కడినుంచి మహిళలు అక్రమ రవాణా చాలా దారుణంగా జరుగుతుందని ఆయన పదే పదే సభల్లో చెప్పడం ద్వారా ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చ మొదలైంది. ఇప్పుడు ఆ అదృశ్యం వెనుక కారణాలను చెప్పే పనిలో వాలంటీర్లను ఆయన నిందిస్తున్నారు. అంటే ఆయన మొదటి చెప్పిన ఆడపిల్లల అదృశ్యం వెనుక కూడా ఒక వ్యూహం ఉంది అన్నది ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. దానికి సంబంధించిన అంశం రిలేటెడ్ గానే వాలంటీర్ల విషయం కూడా ఆయన బయటకు తీసుకొచ్చారు. దీని ద్వారా పూర్తిస్థాయిలో వాలంటీర్లు సేవలు, వారు తీసుకుంటున్న సమాచారం వెనుక అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేయగలిగారు. దీంతో ప్రజలు గతంలో లాగా వాలంటీర్లు అడిగిన వెంటనే సమాచారం ఇచ్చేందుకు కూడా భయపడే అవకాశాలు లేకపోలేదు. వాలంటీర్లు గట్టిగా అడిగితే వారిపై అనుమానం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది. దీంతో వాలంటీర్లు వారిని ఫోర్సు చేసి వైసిపికి ఓట్లు వేయాలని అడిగే అవకాశం కూడా ఇవ్వకూడదు అన్నది పవన్ కళ్యాణ్ ప్రజలకు నూరి పోస్తున్న మానసిక సిద్ధాంతం. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద చెడు అభిప్రాయం కలిగిందో ఆ వ్యక్తి చెప్పిన మాటకు వ్యతిరేకంగా మన మెదడు పనిచేస్తుంది. ఇప్పుడు వాలంటీర్లకు వ్యతిరేకంగా ప్రజల మెదడును పవన్ కళ్యాణ్ సిద్ధం చేయనున్నారు. దీనికి అనుగుణంగానే వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు చెప్పినట్లు కాకుండా వ్యతిరేకంగా ప్రజలు పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేసేలా వారిని సంసిద్ధం చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన సిద్ధాంతపు లెక్కలు సాదాసీదావి కాదు. దాని వెనుక పటిష్ట వ్యూహం రాజకీయ ఎత్తుగడ ఉండడంతోనే ఆయన వాలంటీర్ల మీద వ్యాఖ్యలు చేశారు అని చెప్పొచ్చు. దీనికి తోడు వాలంటీర్ల పనితీరు మీద వైసిపి నేతల్లోనే అసహనం ఉంది. తమ పరిధిలో లేకుండా మొత్తం అధికారాలను వాలంటీర్లకు కట్టబెట్టారని ఇప్పటికే క్షేత్రస్థాయిలో వార్డు మెంబర్లు దగ్గర్నుంచి ఎమ్మెల్యేల వరకు బాధపడుతున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వారికి బూస్ట్ ఇచ్చాయి అని చెప్పొచ్చు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు ఎవరు వాలంటీర్లకు అనుకూలంగా పెద్దగా స్పందించింది కూడా కనిపించడం లేదు. ఇటు వైసీపీ నేతలు నుంచి… అటు ప్రజల నుంచి ఆయన మద్దతును కూడగట్టి ఒక పటిష్టమైన ఎత్తుగడను తలకు ఎత్తుకున్నట్లే కనిపిస్తుంది. ఇది ఎంత మీద ప్రజల్లోకి వెళ్తుంది అన్నది మాత్రం చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *