fbpx

పవన్ కొత్త వ్యూహం సూపర్

Share the content

విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి సభ మేధావుల సైతం విస్తృత చర్చకు కారణమైంది. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడిన పవన్ కేవలం ప్రభుత్వ విధానాల మీదనే ప్రశ్నల వర్షం కురిపించారు. ఎక్కడ వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా ఆయన చేసిన ప్రసంగాలు నిర్వహించిన కార్యక్రమాలు సైతం మేధావి వర్గాల్లో ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి అన్న ముద్ర పడింది. విశాఖలో ముఖ్యంగా కీలకమైన కేంద్ర ప్రభుత్వ రంగ శాఖలు ఉంటాయి. దేశంలోని నలుమూలల నుంచి వచ్చి విశాఖలో పని చేసే ఉద్యోగులు అధికం. దీంతోపాటు కార్మిక వర్గాలు, సాధారణ మధ్యతరగతి ప్రజలు విశాఖలో ఎక్కువగా కనిపిస్తారు. ఈ ప్రాంతంలోని సమస్యలు జరుగుతున్న దోపిడీ గురించి బహిరంగ సభలో చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా చూపించడం కూడా పవన్ కళ్యాణ్ చక్కగా చేశారు. ఎక్కడ వ్యక్తిగత నిందలకు వెళ్లకుండా విశాఖ ఎంపీ చేస్తున్న అక్రమాలను సైతం ఆయన ప్రత్యక్షంగా ప్రజలకు చూపించగలిగారు. దీంతో పవన్ వ్యూహం ఫలించినట్లు అయింది.

విశాఖ వాసులు కోరుకుంటున్నది ఇదే

విశాఖపట్నం నగరం పరిధిలో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ దక్షిణాది ఉత్తరాది ఓట్లు కలబోతగా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. విజ్ఞానవంతులు మేధావులు సైతం విశాఖలో అధికం. నీతో అన్ని వర్గాలను అలరించేలా పవన్ పర్యటన సాగింది. క్షేత్రస్థాయి పర్యటనల్లో అనకాపల్లి భూముల దగ్గర నుంచి, భీమిలి ఎర్రమట్టి దిబ్బలు, సిరిపురం జంక్షన్ లో మంత్రి ఆక్రమించి కడుతున్న అతిపెద్ద భవంతి నిర్మాణం కూడా పవన్ పాయింట్ అవుట్ చేయగలిగారు. దీని ద్వారా విశాఖలో జరుగుతున్న భూ దోపిడీలు గురించి ప్రజలు చర్చించుకునేలా పవన్ పావులు కదిపారు. రెండు సభల్లోనూ పవన్ చేసిన వ్యాఖ్యలు చాలా సహేతుకంగానూ ప్రభుత్వ విధానాలను ప్రత్యక్షంగా ప్రశ్నించే విధంగాను ఉండడంతో వైసీపీ నేతలు కనీసం నోరు మెదపడానికి కూడా భయపడేలా పవన్ పరిస్థితిని తీసుకొచ్చారు. భూములు విషయం గురించి ఎంపీ మీద చేసిన వ్యాఖ్యలపై తర్వాత ఎంపీ పెట్టిన ప్రెస్ మీట్ విషయంలోనూ వైసీపీ తేలిపోయింది. అలాగే ప్రతి బహిరంగ సభ తర్వాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు గురించి ఇష్టానుసారం మాట్లాడే మంత్రులు కూడా ఈసారి వారాహి యాత్రలో ఏ మాత్రం ఆయనకు సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. కేవలం వ్యక్తిగత విమర్శలను మాత్రమే నమ్ముకున్న వైసీపీ నేతలు దానినే బలంగా మాట్లాడుతున్నారు తప్పితే పవన్ ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్పడం లేదు అని ప్రజల్లో చర్చను తీసుకురావడం ప్రధానంగా పవన్ కళ్యాణ్ వ్యూహంలా కనిపిస్తోంది. ఇదే కనుక మరి కొన్ని సభల్లోనూ పవన్ కేవలం ప్రభుత్వ విధానాల పైన నేను మాట్లాడితే, వైసిపి నాయకులు మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అని బలంగా చెప్పగలిగితే కచ్చితంగా ప్రజలు అలాగే తటస్థ వర్గాలు దీనిపై ఆలోచన చేసే అవకాశం ఉంది. ఇప్పటికి తటస్థల్లో వైసిపి మంత్రులు గాని ప్రజాప్రతినిధులు గాని వ్యక్తిగత విషయాలు తప్ప అవసరం అయ్యే విషయాలు మాట్లాడరని చర్చ ఉంది. దీనికి మరింత బలం చేకూర్చేలా పవన్ కళ్యాణ్ కనుక మాట్లాడగలిగితే కచ్చితంగా అది వైసీపీకి పెను నష్టానికి దారి తీస్తుంది. మొత్తానికి విశాఖ వారాహి పర్యటనలో పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహం మాత్రం అందరితో శభాష్ అనిపించుకుంది అని మాత్రం చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *