fbpx

మన సీఎం పాపం పసివాడు..

Share the content

ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు విసిరారు. నిజాంపట్నంలో సీఎం జగన్ తనపై చేసిన వ్యాకలకు ప్రతి వ్యాఖ్యలుగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పాపం పసివాడు సినిమా పోస్టర్ను పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్ట్ కు అనుకూలంగా జన సైనికులు సోషల్ మీడియా వేదికగా పాపం పసివాడు అంటూ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను..ఆయన చాలా అమాయకుడు.. అయితే ఇక్కడ చిన్న మార్పు అవసరం ఉంది.. ఆయన చేతిలో ఒక సూట్కేసు బదులుగా అక్రమ సంపాదన కోసం మనీ లాండరింగ్,ఈజీగా చేసే సూట్ కేస్ కంపెనీలు ఉంచాలి. ప్రియమైన ఏపీ సీఎం.. మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెళ్ళ నాగిరెడ్డి కాదు. అక్రమంగా సంపాదించిన మీకు క్లాస్ వార్ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు లేదు.. రాయలసీమ మీ నుంచి మీ గ్రూప్ నుంచి ఏదో ఒక రోజు విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాను.. అక్కడ పాపం పసివాడు సినిమా స్టోరీ కి రాజస్థాన్ ఎడారిలో ఇసుక దెబ్బలు కావాలి.. కానీ ఏపీలో మాత్రం వైఎస్ఆర్సిపి నదుల నుండి ఇసుకను దోచేస్తోంది. వైసిపి ఏజెంట్ల వద్ద ఇసుక తిన్నాలు ఉన్నాయి అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడమే ఆలస్యంగా జన సైనికులు పాపం పసివాడు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని సోషల్ మీడియా వేదికగా తెగట్రోల్ చేస్తున్నారు.

బాపట్ల జిల్లా నిజాంపట్నం మత్స్యకార భరోసా నిధుల్ని సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు. టిడిపి వెంటిలేటర్ పై ఉందని.. అందుకే చంద్రబాబు దత్తపుత్రుడుని నమ్ముకున్నారన్నారు. రెండు చోట్ల పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పనికిరారని ప్రజలు ఓడించారని రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లయిన 175 చోట్ల అభ్యర్థులను పెట్టలేరని విమర్శించారు. దత్తపుత్రుడుకి సీఎం పదవి వద్దు దోపిడీలో వాటా చాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు మంచి చేయడానికి దత్తపుత్రుడు చూస్తున్నారని. ఆయన ఏ పార్టీతో కలవాలో చంద్రబాబు చెబుతున్నారని అన్నారు బీజేపీకి పక్కన చేరుతారు.. చంద్రబాబు విడాకులు ఇవ్వమంటే ఇచ్చేస్తారు. షూటింగులు విరామం ఉన్నప్పుడే బయటకు వస్తాడంటూ జగన్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు కుప్పించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం దత్తపుత్రుడు ఏం చేయడానికైనా రెడీ అని.. పార్టీని హోల్సేల్గా అమ్మేసిన ప్యాకేస్టర్ పవన్ కళ్యాణ్ ప్యాకేజీస్టార్ అని సీఎం జగన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *