fbpx

దిగజారిన వర్మ..

Share the content

గతంలో రామ్ గోపాల్ వర్మ అంటే కొంతమందికి పిచ్చి ఇష్టం ఉండేది. ఆయన మాట్లాడే మాటలు చాలా లాజికల్ గా అనిపించేవి. జీవితం మీద అలాగే పెళ్లి మీద ఆయన చేసిన ఎన్నో వ్యాఖ్యలు ఎంతోమందిని ఆయన ఫాలోవర్లుగా మార్చాయి. సినిమాల్లో ఎంత పాపులర్ ఆయన రాంగోపాల్ వర్మ అలాగే తాను చెప్పిన జీవిత థియరీ లో కూడా అంతే పాపులర్ అయ్యారు. అయితే ప్రతి విషయాన్ని చాలా లాజికల్ గా చెబుతారని పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో పొలిటికల్ పరంగా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. గతంలో ఆయన వ్యాఖ్యలను ఎంతో ఇష్టపడిన వారే సోషల్ మీడియాలో ఇప్పుడు దారుణంగా ట్రోల్ చేసే స్థాయికి దిగజారి పోయారు.

వైసీపీ కి బహిరంగ మద్దతు

రాంగోపాల్ వర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను రెండుసార్లు కలిశారు. అలాగే వైసిపి పెద్దలతోనూ మొదటి నుంచి టచ్ లో ఉన్నారు. ఆయన ఇటీవల తీసిన కొన్ని చిత్రాలు సైతం వైసీపీ నేతలు స్పాన్సర్ చేసినవే. వైసీపీకి పూర్తి అనుకూలంగా మారిపోతూ వర్మ చేస్తున్న ట్వీట్ ల సారాంశం ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చినియాంశము అవుతుంది. గతంలో ఏ విషయాన్ని అయినా లాజికల్ గా, అందరూ మెచ్చేలా చెప్పే రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఏకపక్షం వహించడం ఆయన ఫ్యాన్స్ కు కూడా నచ్చడం లేదు. ముఖ్యంగా వైసిపి పూర్తిస్థాయి కార్యకర్తగా మారిపోతూ ఆయన చేస్తున్న ట్వీట్లు ఆయనలోని అసలు గుణాన్ని బహిర్గత పరుచుతుంది అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్న రాంగోపాల్ వర్మ వైసిపి దగ్గర గట్టి ప్యాకేజీ మాట్లాడుకుని రంగంలోకి దిగారు అని కొందరు చెబుతున్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్కు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఎన్నికలు వస్తున్న తరుణంలో వైసిపి ప్రధాన వ్యూహంలో భాగంగానే ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను పూర్తిస్థాయిలో ట్రోల్ చేసేందుకే రాంగోపాల్ వర్మను వైసీపీ రంగంలోకి దింపింది అని తెలుస్తోంది. భవిష్యత్తులో ఆయన తీరు ఎలా మారుతుంది, జనసేన కార్యకర్తలను ఆయన ఎంత మేర విసిగించనున్నారు అన్నది ఎన్నికల్లో ప్రధాన అంశం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *