fbpx

స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తి జగన్ : పవన్ కళ్యాణ్

Share the content

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..తన స్వార్థం కోసం మతాన్ని వాడుకుంటారు.. కానీ జీసస్ వాక్యాలు పాటించే వ్యక్తి కాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు.గురువారం మంగళగిరి లో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ మత పెద్దలలో పవన కళ్యాణ్ సమావేశం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పవన్ కళ్యాణ్ క్షేమాన్ని, విజయాన్ని ఆకాంక్షిస్తూ క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 97,000 మంది ఫాస్టర్ లకు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి…తీరా 8,500 మందికి మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. మధ్యపాన నిషేధం,సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు…ఎది నిలబెట్టుకోలేదు.జగన్ రెడ్డి క్రిస్టియానిటిని వాడుకుంటున్నారు.. మోదీ దగ్గరకు వెళ్లిన ప్రతి సారి వెంకటేశ్వర స్వామి ఫోటోలే తీసుకువెళతారు. అవసరాన్ని బట్టి హిందుయిజాన్ని వాడుకుంటున్నారు.తాను ఆ విధంగా చేయను అని పేర్కొన్నారు.ఇష్ట పూర్వకంగా మతం మారడానికి ఎవరికైనా సంపూర్ణమైన హక్కు ఉందన్నారు. మానవత్వంతో నిలబడే వ్యక్తికి మతం ఉండదని..ఎవరైతే తన మతాన్ని ప్రేమించి ఇతర మతాలను గౌరవిస్తారో…వారే ప్రజలకు న్యాయం చేయగలరని పేర్కొన్నారు.

జనసేన క్రైస్తవులకు వ్యతిరేకం కాదు
జగన్ హయాంలో 517 దేవాలయాలు అప్రవితమయ్యాయి.అందుకు సంబంధించిన దోషులను పట్టుకొకపోతే పాలకుడు అన్య మతస్థుల పక్షం వహిస్తున్నారనే భావన హిందువులకు కలుగుతుంది.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక..క్రైస్తవ సమాజం ఇలాంటి పనులకు పాల్పడుతోందన భావన అంతర్గతంగా పెరిగిపోతుంది.ఇది సమాజానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి అంశాలను జీసస్ నుంచే నేర్చుకున్నానని వెల్లడించారు.క్రిస్టియన్ మనోభావాలకు,ప్రాథమిక హక్కుల కు భంగం కలిగితే అండగా నిలబడతా ..జగన్ మాదిరిగా మాటలు చెప్పను..మాట ఇచ్చే ముందే ఆలోచించి మాట్లాడుతాను అని తెలిపారు.జనసేన పార్టీ క్రైస్తవులకు వ్యతిరేకం కాదు..మా ఇంట్లో క్రిస్టమస్ వేడుకలు నిర్వహిస్తాం..క్రైస్తవ ప్రార్థనలు చేస్తారు..ఎన్నికలు కోసం నటించనని పేర్కొన్నారు. మైనార్టీలకు కేటాయించిన నిధులు క్రిస్టియన్ మైనార్టీ సోదరులకు ఎందుకు రావటం లేదని అంశం పై విచారణ జరిపి వారికి అందాల్సిన నిధులు వారికే ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

రామ జన్మ భూమి కి విరాళం ఇచ్చారు కదా అని మాట్లాడుతున్నారు…మసీదులకు 25 లక్షలు ఇచ్చాను. ఎక్కడ తేడా చూపలేదు. ధర్మం ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడని మనస్పూర్తిగా విస్వసిస్తాను. దేశం తాలూకు మూల లక్షణమే మన మతాన్ని ప్రేమించి..ఇతర మతాలను గౌరవించటం.మైనార్టీలు అనే పదమే ఇష్టం ఉండదు.దేవాలయాలు మీద దాడులు జరిగితే ఎలా స్పందిస్తానో..మసీదు,చర్చీలు మీద దాడులు జరిగిన అదే విధంగా స్పందిస్తానని పేర్కొన్నారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు ఎంత భక్తితో వెళ్లి కూర్చున్నానో..అమలాపురం లో ఏర్పాటు చేయనున్న ప్రార్థనలో కూడా అంతే భక్తితో వచ్చి కూర్చుంటాను.మంచి మనసుకు మంత్రం అవసరం లేదని మనస్పూర్తిగా విస్వసిస్తాను అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *