fbpx

దశాబ్దం పాటు జనసేన, తెలుగు దేశం ప్రభుత్వం

Share the content

వైసిపి విధ్వంసకర పాలన గురుతులు చేరిగిపోయి సుస్థిరమైన, సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కళకళలాడలంటే జనసేన, టిడిపి ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు కొనసాగాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నం నగర పాలక సంస్థ వైసిపి కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్,ప్రకాశం జిల్లా దర్శి నుంచి గరికపాటి వెంకట్ లు జనసేన పార్టీలో చేరారు.వారిరువురికి కండువాలు కప్పి పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా వైసిపి గూండాలను ఎదుర్కొంటున్నామంటే యువత,మహిళలే మన ప్రధాన బలమని తెలిపారు.వైసిపి పాలనలో ఆంధ్రప్రదేశ్ దిక్కు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని వైసిపి పాలకులు కుక్కలు చింపిన విస్తరి చేశారని దుయ్యబట్టారు. సినిమా టికెట్ల కోసం తహశీల్దార్ నుంచి సిఎస్ వరకు పనిచేసే రోజులు పోయి,అధికారులు ప్రజల కష్టాలు తీర్చడానికి ,కన్నీళ్లు తుడవడానికి పని చేసే రోజులు తీసుకువస్తామన్నారు. ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించి రాష్ట్రం బాధ్యతను తీసుకుంటాను అని హామీ ఇచ్చారు.

  • రాష్ట్ర ప్రయోజనాల కొరకే బిజెపి కి మద్దతు
    ముస్లింలను మైనార్టీలు గా అభివర్ణించడం ఇష్టం ఉండదని,వారు సమాజంలో బాగం కావాలని ఆకాంక్షించారు. ముస్లిం ప్రాంతాల అభివృద్ధి,కుటుంబాల ఉన్నతి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే ఎదో ఒక జాతీయ పార్టీతో ఉండక తప్పని పరిస్థితి దేశంలో ఉందని తెలిపారు. బిజెపి కి తాను మద్దతు ఇచ్చినా ముస్లింలకు అన్యాయం జరిగితే మీ పక్షానే బలంగా నిలబడతాను అని పేర్కొన్నారు.
  • వైసిపి విముక్త జిల్లాగా ప్రకాశం
    ఫ్లోరైడ్ బాధితులు,యువత వలసలతో ప్రకాశం తన రూపు కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మైనింగ్ మాఫియా తో ప్రకాశం జిల్లా పూర్తి స్థాయిలో కొందరి నాయకుల చేతిలో చిక్కుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఫ్లోరైడ్ నీళ్ళు, నిరుద్యోగం లేని ప్రకాశాన్ని చూడాలనేది తన కళ అని తెలిపారు. వచ్చే జనసేన, టిడిపి ప్రభుత్వంలో జిల్లాకు వైభవం తీసుకురావాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి విముక్త జిల్లాగా చేయాల్సిన బాధ్యత ఇరు పార్టీల నాయకత్వం పైన ఉందని,అందుకోసం బలంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *