fbpx

ఆచితూచి పవన్ ప్రసంగం.

Share the content

పవన్ కళ్యాణ్ ఆచితూచి మాట్లాడుతున్నారు హామీలు అలాగే ఇస్తున్నారు. జనసేన ప్రభుత్వం వస్తుందని కచ్చితంగా తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లే అవకాశం లేకపోలేదని చెప్తూనే, తమ ప్రభుత్వంలో ఎలాంటి ఉంటాయి అన్న విషయాన్ని చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో… సంక్షేమ పథకాలు ఇబ్బడి ముబ్బడి హామీలను ఇచ్చేందుకు పవన్ ఆలోచిస్తున్నారు. ఉచిత హామీలను కచ్చితంగా ఇస్తాం అని చెప్పకుండానే సంక్షేమ పథకాలు మాత్రం జనసేన ప్రభుత్వంలో తప్పనిసరిగా ఉంటాయి అని చెప్పడం ద్వారా ఆయన కొత్త మార్గంలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

సంపద సృష్టించి సంక్షేమం చేస్తాం

వైసిపి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వల్ల రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు వెళ్లిందని, భవిష్యత్తులో అప్పులు గొప్పగా తయారు అవుతుందని జనసేన పార్టీ మొదటి నుంచి వాదిస్తోంది. దీంతో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఉచిత సంక్షేమ పథకాల వైపు కాకుండా కచ్చితంగా రాష్ట్రంలో సంపద సృష్టించి దాని నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు. జనసేన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఉంటాయి అని చెబుతూనే కచ్చితంగా సంపాదన సృష్టించి మాత్రమే దానిని ప్రజలకు పంపిణీ చేస్తాం తప్ప అప్పులు చేసి మాత్రం కాదని నొక్కి వక్కాడిస్తున్నారు. దీని ద్వారా ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో వ్యతిరేకతను జనసేన పార్టీ మూటగట్టుకునేందుకు సిద్ధంగా లేదు అని పవన్ సంకేతాలు ఇస్తున్నట్లు అవుతోంది. సంపద ఎలా సృష్టిస్తామో జనసేన పార్టీ ప్రధానంగా చెబుతున్న షణ్ముఖ వ్యూహంలో ఎలా ముందుకు వెళ్తాము వివరించేందుకు పవన్ ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ఇసుక దోపిడీ సహజ వనరుల దోపిడీను కచ్చితంగా అడ్డుకుంటే షణ్ముఖ వ్యూహంలో అభివృద్ధి సాధ్యమే అని, ముఖ్యంగా యువతకు ఒక అద్భుతమైన మార్గం చూపగలమని ఆయన పదే పదే చెబుతున్నారు. దీంతోపాటు పూర్తిగా పరిశీలించి స్టడీ చేసిన తరువాతనే పథకాలను ప్రకటిస్తున్నారు. మేనిఫెస్టోను కూడా హడావుడిగా ప్రకటించమని నిపుణులతో కూర్చున్న తర్వాత అలాగే క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పవన్ స్వయంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రజలకు ఏమి అవసరమో దానిని కచ్చితంగా మేనిఫెస్టోలో పెడతామని పవన్ చెప్పడం ప్రజలకు దగ్గరే ఎందుకు ఒక మార్గం అని చెప్పాలి.

ఉమ్మడి మేనిఫెస్టో ఏది?

నిన్న మొన్నటి వరకు పొత్తుల ద్వారా వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా జనసేన ఎవరికివారుగా ప్రజల వద్ద హామీ ఇస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తాము అన్నది చెబుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యంగా పొత్తుల ధర్మం ఉన్నప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడం అనేది రివాజు. దానిని వేదికగా చేసుకునే ఎన్నికల రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రెండు పార్టీలు కూడా విడివిడిగా మానిఫెస్టోలను హామీలను ఇస్తుండడం ఒక అయోమయ వాతావరణాన్ని సృష్టిస్తోంది. విపక్ష పార్టీల్లో జరుగుతున్న ఈ పరిణామాలు అన్ని అధికార పక్షం నిశితంగా గమనిస్తోంది. విపక్షాల నాయకులలో వచ్చిన మార్పులను అలాగే వారి మాటలను గమనిస్తున్న వైసీపీ దానికి అనుగుణంగా ఎలాంటి ప్రణాళికను తయారు చేసుకోవాలి అన్నది కూడా ఆలోచిస్తోంది. తెలుగుదేశం పార్టీకి పూర్తి భిన్నంగా హామీలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్న పవన్ కళ్యాణ్ తీరు మీద సానుకూలమైన చర్చ జరగడం, ఒత్తులు ఉంటేనే బాగుంటుంది అన్న చర్చి కూడా ప్రజల్లో ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. అయితే పొత్తులపై మరికొద్ది రోజుల్లో స్పష్టత మరింతగా వచ్చే అవకాశం అయితే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *