fbpx

రైతు కష్టం ప్రభుత్వానికి కనబడదా….?

Share the content

తూర్పుగోదావరి జిల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో కడియం ఆవాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించి రైతు నష్టపోయిన పంటను పరిశీలించారు. గుట్టలుగా పోసిన తడిచిన ధాన్యాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అదే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో హడావిడిగా ధాన్యం కొనుగోలు చేసి లారీల్లో లోడింగ్ చేసి ఉంచిన ధాన్యాన్ని రైతులు పవన్ కళ్యాణ్ కు చూపించారు.

ఆవేదన వెళ్లగక్కిన రైతు..

పంట నష్టం వాటిలితే అధికారులు ఉండి కనీసం పలకరింపు లేదు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసిపి పాలకులు ఎక్కడ ఉన్నారు.
రైతుకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ మేముంటామని చెప్పారు.. ఇప్పుడు అకాల వర్షాలకు పంట నష్టపోతే పట్టించుకున్న దిక్కు లేదు.
ముఖ్యమంత్రి గారు రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రకటించారు. ఆ నిధి ఏమయ్యిందో ప్రభుత్వంలో ఉన్న వారికే తెలియాలి. వర్షాలు, వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉంటే ఆ డబ్బు ఎక్కడ దాచుకున్నారు? ఎకరాకి రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చు అయ్యింది. అకాల వర్షాలకు ఎకరాకి 20 బస్తాలు పైనే నష్టపోయాం. ధాన్యం నల్లపాయ వచ్చేసింది. మాకు వ్యవసాయం తప్ప మరో పని చేతకాదు. మద్దతు ధర రూ.1530 ఉంటే మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తూ తరుగు పేరిట బస్తాకి రూ. 200 వరకు కోత పెడుతున్నారు. ఆ ఖర్చులు ఈ ఖర్చులు రైతుల నెత్తినే వేస్తున్నారు. బస్తాకి రూ. 1200 నుంచి రూ. 1300 మాత్రమే వస్తోంది. మొలక వచ్చిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని అస్సలు కొనడం లేదు. రైతు పండించిన ధాన్యాన్ని మాత్రమే కొనమని అడుగుతున్నాం. మొదట 33 బస్తాలు కొంటామన్నారు. రైతులంతా ధర్నా చేస్తే ఇప్పుడు కొంత పెంచారు.
తీసుకున్న ధాన్యానికి డబ్బులు ఎప్పుడొస్తాయో తెలీదు.
రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనాలి. కొంతే కొంటామంటే ఎలా? మీరు వస్తున్నారని ఇప్పుడు హడావిడిగా ధాన్యం తోలేస్తున్నారు. తోలిన ధాన్యానికి అక్కడికి వెళ్లాక వంకలు పెడుతున్నారు. దానికీ డబ్బులు ఎప్పటికి వస్తాయో తెలియదు. రైతు భరోసా కేంద్రాలకు చెందిన వాళ్లు, స్థానిక నాయకులు వచ్చి ఒక వంతు ధాన్యం వెళ్లిపోయింది.. మూడొంతుల ధాన్యం వెళ్లిపోయిందని చెబుతున్నారు. ధాన్యం ఇంకా చాలా వరకు కళ్లాల్లోనే ఉంది. మీకు చూపాలనే లోడు చేసిన లారీలు అడ్డుకున్నాం.
చివరికి కాలువల్లో పూడిక మేమే తీసుకుంటున్నాం. మరమ్మతులు మేమే చేసుకుంటున్నాం. ఆవలో ఖరీఫ్ మొత్తం నీళ్లలోనే మునిగి ఉంటుంది. రబీ ఒక్కటే మిగిలేది. ఇప్పుడు అకాల వర్షాలకు అదీ పోయింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల కష్టాలు ఓపికగా ఆలకించిన పవన్ కళ్యాణ్ పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందనిరైతులకి భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *