fbpx

10 వేలు దాటితే ప్యాకేజి!

Share the content

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పెద్ద ప్లాన్ కు తెరతీస్తోంది. ముఖ్యంగా సమాచారం మాధ్యమాలను పూర్తిగా తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా ఉండే పత్రికలు, ఛానళ్లు గురించి పట్టించుకోని వైసిపి ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ మీడియా వైపు ఇప్పుడు దృష్టి పెట్టింది. నేటి కాలంలో డిజిటల్ మీడియా కీలకమైన పాత్ర పోషిస్తుండడంతో దానిని కచ్చితంగా వైసీపీ వైపు తిప్పుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ప్యాకేజీని సిద్ధం చేశారు.

10 వేలు దాటితే ప్రత్యేకంగా ప్యాకేజి

డిజిటల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్, యూట్యూబ్ ఛానళ్లను టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 10000 సబ్స్క్రైబర్స్ దాటిన యూట్యూబ్ ఛానల్ ను, పదివేల ఫాలోవర్స్ పైబడిన ఫేస్బుక్ పేజీలను వైసీపీ పెద్ద మొత్తంలో రకరకాల ప్యాకేజీలుగా విభజించి ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూట్యూబ్ ఛానళ్ల లిస్టును తయారు చేసింది. త్వరలోనే వైసీపీ పెద్దలు ఆయా చానల్ల వ్యక్తులతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. వైసీపీకి ఎలా సపోర్ట్ చేయాలి..?? ఎలా ముందుకు వెళ్లాలి..? విధి విధానాలను అక్కడ చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీనికి తగినట్లుగానే పారితోషకాలు భారీగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫేస్బుక్ పేజీలు, మీమ్స్ తయారు చేసే వ్యక్తులతోనూ ప్రత్యేకంగా మాట్లాడి వారి మద్దతు కూడగట్టే ఆలోచనలు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే వీరందరికీ ప్రత్యేకంగా కార్యక్రమాలు పెట్టాలని వైసిపి అధిష్టానం భావిస్తోంది. దీనికి ప్రత్యేకంగా పార్టీ నుంచి ఒక ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇప్పటికే కేటాయించారు. డిజిటల్ మీడియా రంగంలో పూర్తిగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేయించే బాధ్యతను వారిపై పెట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *