fbpx

గ్యాస్ వెలికితీత పనుల వలన నష్టపోతున్న మత్యకారులను ఆదుకోవాలి : మధు

Share the content

కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓఎన్జీసీ గ్యాస్ వెలికితీత పనుల వలన నష్టపోతున్న ఎటిమోగ , తదితర గ్రామాల మత్యకారలకు నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్ , సీపీఐ రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఒక ఒక ప్రకటన విడుదల చేశారు. మత్యకారులను ఆదుకోవాలని ఈరోజు కాకినాడ లో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందోళన చేయడం అభినందనీయం అన్నారు . మంగళవారం ఈదే అంశం పై సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశము నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయాలు అతీతంగా గా కాకినాడ ప్రజలు గ్యాస్ పై ఉద్యమిస్తే గుజరాత్ తరహాలో ఇక్కడ కూడా అతి తక్కువ ధరకు కాకినాడ ప్రజలకు ఇంటింటింటికి గ్యాస్ సప్లే చేయవచ్చని పెట్రోల్ ధర అందరికి అందుబాటలో ఉంటుందని పేర్కొన్నారు . అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి గ్యాస్ పైప్ లను బ్లాక్ చేయాలని తెలిపారు . దీనిపై హై కోర్ట్ లో కూడా పిల్ వేస్తున్నామని దీనికి కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ ప్రణాళిక వేస్తుందని అన్నారు. సోమవారము జిల్లా కలెక్టర్ ను అఖిలపక్షం కలుస్తుందని మధు అన్నారు మార్చి రెండవ వారం లో దీనిపై కాకినాడ లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని మధు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *