fbpx

చిలకలూరి పేట ప్రవీణ్ దేనా??.

Share the content

భాష్యం ప్రవీణ్.. నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఈ వ్యాపారవేత్త పేరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్. నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు ఈయన స్పాన్సర్. చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ ఆశావాహుడు. చంద్రబాబు 73వ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి 73 లక్షల విరాళం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు ప్రవీణ్. దీంతోపాటు చిలకలూరిపేట నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ ట్రస్టును స్థాపించి అక్కడున్న ప్రజలతో మమేకమై ఎందుకు భాష్యం ప్రవీణ్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీన్ని గమనించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎప్పటికీ భాష్యం ప్రవీణ్ మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం, ఇప్పటికే భాష్యం ప్రవీణ్ కు టికెట్ కన్ఫర్మ్ చేశారు అన్న ప్రచారంతో చిలకలూరిపేట రాజకీయాలు వేడెక్కాయి.

పుల్లారావుకు భయం

ప్రతిపాటి పుల్లారావుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ భయం పట్టుకుంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే ప్రవీణ్ కు టికెట్ కేటాయించారు అన్న ప్రచారంతోపాటు ఆయన చిలకలూరిపేటలో సొంతంగా ఒక వర్గాన్ని తయారు చేయడం ఇప్పుడు గొడవకు ప్రధాన కారణం అవుతుంది. చిలకలూరిపేటలో కనీసం ఓటు కూడా లేని ప్రవీణ్ కు ట్రస్ట్ పేరిట టికెట్ ఎలా కేటాయిస్తారని ఇటీవల ప్రత్తిపాటి పుల్లారావు విలేకరులు సమావేశంలోనే మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కొత్తవారిని యువకులను ప్రోత్సహించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే సెర్చింగ్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఆర్థికంగా ఉన్న భాష్యం ప్రవీణ్ వంటి వ్యక్తులు నారా లోకేష్ కు తారసపడ్డారు. దీంతో స్వయంగా పార్టీ వ్యవహారాలు చూస్తున్న నారా లోకేష్ ప్రవీణ్ వంటి వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో పార్టీకి బాగుంటుందని కోణంలో చిలకలూరిపేటలో పని చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు యువగలం పాదయాత్రకు కూడా ప్రవీణ్ భారీగా సహాయం చేస్తుండడం, కొత్త తరం నాయకత్వం ప్రోత్సహించాలనే కోణంలో ప్రవీణ్ కు దాదాపు టికెట్ కన్ఫామ్ చేసినట్లే. అయితే పుల్లారావు కు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పంపిస్తామని హామీ దక్కినట్లు తెలుస్తోంది. దీంతోనే పుల్లారావు పూర్తిస్థాయిలో సైలెంట్ అయ్యారు. అయితే కచ్చితంగా ఎన్నికల సమయానికి మాత్రం పుల్లారావు ఏమైనా బాంబు పేలుస్తాడా అనే సందేహం టిడిపి నేతలను వెంటాడుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *