fbpx

ఎన్జీటీ తీర్పులోని ప్రతి అంశాన్ని పాటించాలి : సుప్రీంకోర్టు

Share the content

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని గురువారం ఆదేశించింది. కేంద్ర పర్యావరణశాఖ తరచూ తనిఖీలు చేపట్టాలి.తనిఖీల సమాచారం రాష్ట్ర అధికారులకు ఇవ్వనవసరంలేదని స్పష్టం చేసింది.టోల్‌ఫ్రీ నంబర్‌, ఈమెయిల్‌ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. సుప్రీంకోర్టు చెప్పాక కూడా యంత్రాలు వాడారని కేంద్ర పర్యావరణశాఖ తరఫు న్యాయవాది తెలపగా.. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలకు వెనుకాడవద్దని ఆదేశించింది..ఎన్జీటీ తీర్పులోని ప్రతి అంశాన్ని తప్పక పాటించాలి. కేంద్ర అధికారులు గుర్తించిన మైనింగ్‌ ప్రదేశాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆయా ప్రదేశాలను జిల్లా కలెక్టర్లు తనిఖీ చేయాలి. ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి క్రిమినల్‌ చర్యలు చేపట్టాలి. జూన్‌ 9లోపు ఆదేశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్‌ సమర్పించాలి” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణ జులై 15కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *