fbpx

నెల్లూరులో నారాయణ మంత్రం.

Share the content

మొన్నటి వరకు తన వ్యాపార కార్యకలాపాలతో విద్యా కార్యకాల పాలతో పూర్తిస్థాయిలో బిజీగా గడిపిన పొంగూరు నారాయణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొలది మళ్లీ టిడిపిలో యాక్టివ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నెల్లూరు సిటీ స్థానం నుంచి పోటీ చేసేందుకు నారాయణ సంసిద్ధమవుతున్నారు. వైసిపి తీరుతో వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో మునిగిపోయిన నారాయణ సిఐడి కేసులను ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పడరాని పాట్లు పడ్డారు. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వచ్చిన నారాయణ చాలా కాలం పాటు టీడీపీ కార్యకర్తలకు దూరంగా ఉంటూ వచ్చారు. మహానాడు లాంటి పార్టీ కార్యక్రమాలకు కూడా నారాయణ వెళ్లలేదు. దీంతో మీడియాలోనూ రకరకాల ప్రచారాలు ఊహాగానాలు అధికమయ్యాయి. నారాయణ పార్టీ మారుతున్నారు అని వివిధ రకాల మాటలు వినిపించాయి.

సిటీ స్థానం ఆయనదే

నెల్లూరు సిటీ స్థానాన్ని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నారాయణ కోసం రిజర్వ్ చేసింది. మొత్తం నారాయణ తెలుగుదేశం పార్టీ ఆర్థిక వ్యవహారాల్లోనూ కీలకంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు నారాయణ ను కొన్ని రోజులపాటు సైలెంట్ గా ఉండాలని పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా జరగాలని ఆదేశించడంతోనే నారాయణ పూర్తిస్థాయి సైలెంట్ పాటించారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నారాయణ మళ్ళీ బయటికి వచ్చి పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ దానికి తగినట్లుగా అన్ని వర్గాలను కలుపుకు వెళుతూ, ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలను యాక్టివ్ చేసే పనిలో భాగంగా నారాయణను మళ్లీ యాక్టివ్ కావాలని ఆదేశించడంతో లోకేష్ పాదయాత్రలోను పాలుపంచుకుంటున్నారు. దీంతోపాటు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి నారాయణ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచే అవకాశం 100% ఉంది. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తే నెల్లూరు సిటీ నుంచి కచ్చితంగా పొంగూరు నారాయణ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఆనం రామనారాయణరెడ్డి కూడా నెల్లూరు సిటీ స్థానం మీద కన్నేసినప్పటికీ నారాయణ ఉన్నారని ముందుగానే టీడీపీ చెప్పడం విశేషం. దీంతో రాం నారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో తన కూతురు కైవల్యా రెడ్డిని బరిలోకి నిలిపే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణరెడ్డి పోటీకి అంతా సుముఖంగా లేరు. ఒకవేళ నెల్లూరు సిటీ నియోజకవర్గం ఇస్తే మాత్రం ఆనం రామనారాయణరెడ్డి మళ్ళీ స్వయంగా రంగంలోకి దిగుతామని చెప్పారు. అయితే పార్టీ ఆర్థిక కార్యకలాపాల్లో పూర్తి బాధ్యుడిగా ఉన్న నారాయణను కచ్చితంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి బరిలో నిలపాలని, దీంతో ఆనం కుటుంబానికి వెంకటగిరి కేటాయిస్తేనే మంచిదని లోకేష్ భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారు. ఆనం కుటుంబం నుంచే ఆనం వెంకటరమణారెడ్డి కూడా టిడిపి తరఫున తన వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా నెల్లూరు సిటీ నుంచి టికెట్ ఆశించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నెల్లూరు సిటీని నారాయణకు కేటాయించి నామినేటెడ్ పోస్టులను ఆనం వెంకటరమణారెడ్డికి కేటాయించవచ్చుని తెలుస్తోంది. దీంతోపాటు నెల్లూరు జిల్లాలో చతికిల పడిన టిడిపిని పూర్తిగా బలోపేతం చేసే దిశగా మరిన్ని చేరికలు కూడా త్వరలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *