fbpx

అనిశ్చితికి నేను భాధ్యడుని కాదు : శ్రీకృష్ణదేవరాయలు

Share the content

వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపి లు వరుస షాక్ లు ఇస్తున్నారు.సీట్ల సర్దుబాటు విషయంలో అధినేత నిర్ణయాన్ని ఒక్కరొక్కరుగా వ్యతిరేకిస్తున్నారు. గుంటూరు ఎంపి సీటు విషయంలో రెండు వారాల క్రితం ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. నేడు నరసరావుపేట ఎంపి సీటు విషయంలో శ్రీ కృష్ణదేవరాయలు ఆ పార్టీకి ,ఎంపి సభ్యత్వానికి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నరసరావుపేట ఎంపి అభ్యర్థి పై గత 15 రోజులుగా పార్టీలో అనిశ్చితి నెలకొన్నది అని తెలిపారు. ఆ అనిశ్చితి సృష్టించింది వైసిపి పార్టీ అని తెలిపారు.అనిశ్చితి కి నేను బాధ్యుడిని కాదు అని వివరించారు.క్యాడర్ లో కన్ఫ్యూజన్ నెలకొన్నదని, నరసరావుపేట కు కొత్త అభ్యర్థి వస్తున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది అని పేర్కొన్నారు.పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు.గత ఎన్నికలలో మంచి మెజారిటీతో పార్లమెంట్ పంపించారు.నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధి కు కృషి చేశాను అని తెలిపారు.

  • గుంటూరు సీటు విషయంలో బేధాభిప్రాయాలు
    గుంటూరు పార్లమెంట్ నుంచి కృష్ణదేవరాయలును పోటీ చేయమని వైసిపి అధిష్టానం ఆదేశించింది అని సమాచారం. ఆ విషయాన్ని ఆయన తిరస్కరించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే క్యాడర్ లో ఉన్న అనుమానాలను తెరదించుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. నరసరావుపేట నుంచి నాగార్జున యాదవ్ నిలపాలని వైసిపి అధిష్టానం భావిస్తుంది. అటు తెలుగుదేశం పార్టీ తరుపున నరసరావుపేట ఎంపిగా బరిలోకి కృష్ణదేవరాయలు దిగనున్నారు అని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *