fbpx

ప్యాలెస్ మీద ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్ర మీద లేదా? : లోకేష్

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంపదతో విశాఖపట్నం లో రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకోవడానికి సమయం ఉంది కానీ ….ఉత్తరాంధ్ర కు ఒక్క పరిశ్రమను తీసుకురావడానికి సమయం లేదా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. సోమవారం శ్రీకాకుళం ,ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్ఘాల్లో ఏర్పాటు చేసిన శంఖారావం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఎన్నికల ముందర విశాఖ రైల్వే జోన్ కు అవసరమైన నిధులు,భవనాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వాటి నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆముదాలవలస లో మూత బడిన షుగర్ ఫ్యాక్టరీ నీ ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు, నేడు ఏమైంది అని ప్రశ్నించారు.

విశాఖ ఉక్కు ను కాపాడుతాం

ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కును పరిశ్రమను ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే టీడిపి, జనసేన ప్రభుత్వంలో…రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ నీ కోని కాపాడే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు 25 ఎంపిలను గెలిపించండి…ప్రత్యేక హోదా తెస్తామన్నారు.కనీసం ఇన్ని సార్లు ప్రధానంమంత్రిని కలిశారు…ఒక్క సారి అయినా హోదా గురుంచి అడిగారా? 31 ఎంపిలను కేసుల కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు..నేడు వైసిపి సొంత పార్టీ ఎమ్మెల్యే ,ఎంపి లే బై బై జగన్ అని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక నియోజకవర్గం లో ఉన్న ఎమ్మెల్యే ను చెత్త అని నిర్ణయించి ..వెరే నియోజకవర్గం కు పంపిస్తున్నారు. మన ఇంటి చెత్త …పక్క ఇంటి ముందు వేస్తే బంగారం అవుతుందా? అని ప్రశ్నించారు.

వివేక హత్య కేసులో ఏ 9 గా జగన్

గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అనేక డ్రామాలు ఆడారు..మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య పై నారసుర రక్త చరిత్ర అని అనేక ఆరోపణలు చేశారు.కానీ జగనాసుర రక్త చరిత్ర అని అందరికీ అర్థం అయ్యింది.ఏకంగా చార్జిషీటులో సొంత పార్టీ కి చెందిన అవినాష్ రెడ్డి ఏ 8 గా ఉన్నారు.రేపో మాపో ఏ 9 గా జగన్ చేరనున్నారు అని తెలిపారు. తెలుగుదేశం హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ. 1500 రూపాయలు…నేడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 కు పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక ద్వారా రోజుకు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? రోజుకు 3 కోట్ల రూపాయలు.ఐదేళ్ళలో 5400 కోట్లు దోచేస్తున్నారు అని మండిపడ్డారు.

జగన్ పాలనలో 100 సంక్షేమ పథకాలు రద్దు

ముఖ్యమంత్రి కి కేవలం రెండు బటన్ లు తెలుసు.బల్ల పైన ఉన్న బులుగు బటన్ నొక్కితారు పది రూపాయలు ఇస్తారు…బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతూ…వంద రూపాయలు లాగేస్తారు అని ఎద్దేవా చేశారు.కరెంట్ చార్జీలు 9 సార్లు…ఆర్టీసి చార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు కు శ్రీకారం చుట్టారు.ఇంటి పన్ను చెత్త పన్ను తీసుకువచ్చి ప్రజలపై భారం మోపారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో అన్న క్యాంటీన్ కట్..విదేశీ విద్య దీవెన కట్ …పండుగ కానుక కట్.డ్రిప్ ఇరిగేషన్ కట్.భారత దేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమము కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. రాబోయే టిడిపి, జనసేన ప్రభుత్వంలో… 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు…ఉద్యోగం వచ్చే లోపు 3000 రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తామని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు ప్రతి వెళ్ళే విద్యార్థికి 15,000 రూపాయల,రైతన్న ను ఆదుకోవడానికి ప్రతి సంవత్సరం 20000 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్న అని పేర్కొన్నారు…18- 59 సంవత్సరాలు నిండిన నెలకు 1500 రులయలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *