fbpx

టీడీపీకి జై అంటున్న నాని? అసలేం జరిగింది??

Share the content

నిన్న మొన్నటి వరకు పార్టీ మారుతారు అని ప్రచారం జరిగిన విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని స్వరం పూర్తిగా మారిపోయింది. వైసిపి నుంచి వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయవచ్చు అని జరిగిన ఊహగానాలకు స్వయంగా కేశినేని నాని తన వైఖరి ద్వారా పుల్ స్టాప్ పెట్టారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన దగ్గర నుంచి పూర్తిగా టిడిపికి అనుకూలంగా మాట్లాడుతూ ఢిల్లీలోను బిజెపి పెద్దలను కలుస్తూ కేశినేని నాని పూర్తి టిడిపి వ్యక్తిగా కనిపిస్తున్నారు. దీనికి గల కారణం బయటపడక పోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేశినేని నానికి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ ఇస్తుందా ఇవ్వదా అన్నది ఇంకా తేలలేదు. అయితే పూర్తిగా టిడిపి వ్యక్తిగా మాట్లాడుతున్న కేసినేని నాని రాజకీయంగా గందరగోళం సృష్టించడానికి మాత్రమే ఈ స్టెప్ తీసుకున్నారు అన్నది మొదటి నుంచి విజయవాడ రాజకీయాలను పరిశీలిస్తున్న వ్యక్తుల మాట.

** విజయవాడ ఎంపీగా కేశినేని నానికి తెలుగుదేశం పార్టీలో ఎవరితోనూ పడడం లేదు. మొదటినుంచి ఒంటరిగానే ప్రయాణం చేసిన కేసినేని నాని 2019 ఎన్నికల్లోను ఎంపీగా పూర్తిస్థాయిలో ప్రతి నియోజకవర్గం తిరిగి తన సొంత బలాన్ని పెంచుకున్నారు. విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో కేవలం విజయవాడ తూర్పు తప్ప మరే చోటా తెలుగుదేశం పార్టీ గెలవక పోయినప్పటికీ విజయవాడ ఎంపీగా కేశినేని నానినీ జనం అంగీకరించారు. దీనికి ఆయన మొదటి నుంచి చేసిన గ్రౌండ్ వర్క్ ప్రధాన కారణం. ముఖ్యంగా టాటా గ్రూపు అధిపతి రతన్ టాటా తో ఆయన స్వయంగా కలిసి విజయవాడ లోక్ సభ స్థానం పరిధిలోని కొన్ని గ్రామాల్లో కార్యక్రమాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. దీంతో కేశినేని నానికి సొంత ఇమేజ్ పెరిగింది. టిడిపిలో ఉన్న సమయంలోనే మిగిలిన నేతలతో అంటి ముట్టినట్లు ఉంటూ… ఆయన చేసే కార్యక్రమాలకు సైతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను కూడా పిలవకుండా చేసుకువెళ్లిపోవడం మిగిలిన నేతలకు నచ్చలేదు. దీంతో నాని మీద చంద్రబాబు వద్ద లోకేష్ వద్ద రకరకాల పుకార్లు పుట్టించడం.. రకరకాల రూమర్లతో అధినేతకు కేశినేని నానికి పూర్తిస్థాయిలో దూరం పెంచారు. నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు టిడిపిలోకి నిన్న మొన్న వచ్చిన నేతలు సైతం నానికి దూరంగా వెళ్లిపోవడం తో అధినేత సైతం చాలా రోజులు లైట్ తీసుకున్నారు. అయితే తాజాగా ఆయన తమ్ముడు చిన్నికి వచ్చే ఎన్నికల్లో టిడిపి టికెట్ ఇస్తుంది అన్న ప్రచారం బలంగా జరుగుతున్న వేళ కేశినేని నాని వైసిపి లోకి వెళ్తారు అన్న ప్రచారం కూడా బాగా జరిగింది. అయితే ఇటీవల చంద్రబాబు అరెస్టు తర్వాత కేశినేని నాని పూర్తిస్థాయిలో టిడిపి ఎంపీగా మారిపోయారు. ఆయన రాజకీయ వ్యవహార శైలి కూడా పూర్తిగా అనుకూలంగా మారడంతో ఏం జరుగుతుంది అన్న అయోమయం ఇప్పుడు అందరిలోనూ కలిగింది. నిన్న మొన్నటి వరకు టిడిపికి దూరంగా ఉన్న నాని ఒకేసారి టిడిపి కి అనుకూలంగా మారడం పట్ల రాజకీయ నిపుణులు మాత్రం వేరుగా మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో టిడిపి క్యాడర్ ను అలాగే నాయకులను అయోమయానికి గురి చేసే చర్యల్లో భాగంగానే నాని ఇలా వ్యవహరిస్తున్నారని… నానికి ప్రత్యేకంగా ఎలాంటి టికెట్ హామీ దక్కలేదని వారు చెబుతున్నారు. అయితే నాని మాత్రం మరింత యాక్టివ్ అయి ఢిల్లీ రాజకీయాల్లో కూడా వేలు పెడుతున్నారు. బిజెపి పెద్దలను కలుస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని తెలియజేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ సంపతిని మళ్లీ పోగేసుకునే ప్రయత్నం నాని మొదలుపెట్టారు. అయితే అసలు ఏం జరుగుతుంది అన్నది మాత్రం కొద్ది రోజులు తర్వాత బయటపడే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *