fbpx

కమలం గూటికి రాజుగారు.

Share the content

నర్సాపురం ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి అధికార పార్టీకి కంట్లో నలుసుగా తయారైన రఘురామకృష్ణంరాజు ప్రయాణం ఇప్పుడు కమలం గూటికి చేరుతోంది. ఆయన బిజెపిలో చేరిక దాదాపు ఖాయమైనట్లేనని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని బిజెపి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. జనసేన టిడిపి తో బిజెపి పొత్తు కనక కుదిరితే ఎక్కువగా లోక్సభ స్థానాలు అడగాలని కృతనిశ్చయం తో ఉన్న కమలం పార్టీ దానికి తగిన విధంగా అభ్యర్థులను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా అరుగురామకృష్ణంరాజును బిజెపిలోకి తీసుకువచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతోపాటు ఏలూరు ఎంపీ స్థానం కూడా కోరడానికి బీజేపీ సిద్ధం అవుతోంది.

దక్షిణాది వచ్చే ప్రతి సీటు కీలకమే

వచ్చే బిజెపి ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బిజెపి అన్ని దారులను వెతుకుతుంది. దీనిలో భాగంగా బిజెపికి పట్టు కోల్పోయిన దక్షిణాదిన కచ్చితంగా సీట్లను అన్ని విధాల పెంచుకునేందుకు సమయత్తం అవుతుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 33 సీట్లను గెలుచుకున్న బిజెపి ప్రస్తుతానికి తన హవా తగ్గినట్లు సొంత సర్వేలు చెబుతుండడంతో దక్షిణాదిన వచ్చే సీట్లను గట్టిగా నమ్ముతోంది. దీనిలో భాగంగా జనసేన టిడిపి తో పొత్తు కుదుర్చుకొని అత్యధికంగా లోక్సభ సీట్లను కోరాలని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. సుమారు ఆంధ్రప్రదేశ్లో 8 నుంచి పది స్థానాలు మేర బిజెపి కోరవచ్చని తెలుస్తోంది. దీంతో గెలుపు గుర్రాల వేటలో బిజెపి పెద్దలు నరసాపురం పై దృష్టి సారించారు. గతంలోనూ బిజెపి నుంచి కృష్ణంరాజు ఇక్కడ గెలిచిన దాఖలాలు ఉండడంతో గట్టి అభ్యర్థి అయితే కచ్చితంగా గెలుపు సాధ్యమని బిజెపి గట్టిగా నమ్ముతోంది. రఘురామ కృష్ణంరాజు అయితే కచ్చితంగా ఆర్థికంగాను సామాజికంగానూ నరసాపురం లోక్సభ స్థానం నుంచి సరైన అభ్యర్థి అవుతారని భావించిన బిజెపి అధిష్టానం ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమైనట్లు తేలింది. మరోపక్క ఎప్పటికీ అధికార పార్టీకి నరసాపురం ఎంపీగా ఎవరిని పోటీ చేయించాలి అన్నదానిమీద సందిగ్ధత కొనసాగుతోంది. రఘురామకృష్ణంరాజు తర్వాత సరైన అభ్యర్థిని లోక్సభ అభ్యర్థిగా ప్రకటించే సాహసం వైసీపీ చేయలేకపోయింది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఈ స్థానం నుంచి పోటీలో ఉంటారు. అయితే ఆ సామాజిక వర్గం నుంచి గట్టి అభ్యర్థి ఎవరు వైసీపీ అధిష్టానానికి ఇప్పటి వరకు తారస పడలేదు. ప్రోగ్రామ్ కృష్ణంరాజు సైతం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన సొంత కేడర్ను బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతూ స్థానిక రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీలో ఉంటే టిడిపి జనసేన సంపూర్ణ మద్దతు రఘురామకృష్ణంరాజుకి లభించవచ్చు. దీంతో ఆయన గెలుపు కూడా సాధ్యమని అంచనాలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *