fbpx

గ్రూప్స్ పోస్టులను 2,000 కు పెంచాలి

Share the content

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమాన్ని విజయవాడ భాలోత్సవ భవన్లో నిర్వహించారు. ఈ చర్చావేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కెయస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7న గ్రుప్2 నోటిఫికేషన్ కు సంబంధించి 897పోస్టులకు, డిసెంబర్ 8న గ్రుప్ 1 నోటిఫికేషన్ 81 పోస్టులకు విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ వచ్చింది కానీ నిరుద్యోగ యువత ఆశించిన స్థాయిలో పోస్టులు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాల క్రితమే వేయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఏపీపీఏస్సీ బోర్డ్ ప్రకటించిందని తిరిగి మూడేళ్లు తర్వాత కూడా పోస్టులు సంఖ్య పెంచకుండా అవే ప్రకటించడం అన్యాయమన్నారు. పోస్టుల సంఖ్య ను 2వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ముందు గ్రుప్ 2 నిర్వహించి తర్వాత గ్రుప్ 1 నిర్వహిస్తే నిరుద్యోగులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.

  • ఉచిత స్టడీ సర్కిల్స్ ను తక్షణమే ప్రారంభించాలి
    డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు. వై. రాము, జి.రామన్న మాట్లాడుతూ.. గ్రుప్ 1,2 పరీక్షలకు రెండింటికి మద్య గడువు సమయం ఇవ్వాలని కోరారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉంటుందని ప్రభుత్వం గతంలో చెప్పి ఒక్క ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని, రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున వయోపరిమితి కనీసం 47సంవత్సరాలకు పెంచాలని కోరారు.ప్రభుత్వం నిర్వాహాం వలన లక్షలాది మంది నిరుద్యోగులు అనర్హులుగా మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. కోచింగ్ సెంటర్లకు వేల రూపాయలు ఖర్చు చేయలేక పరీక్షలకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాంఘీక సంక్షేమ శాఖ, బిసి సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగులకు ఉచిత స్టడీ సర్కిల్స్ తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రిలిమ్స్ నుండి మొయిన్స్ కు 1:50 నిష్పత్తిలో తీసుకోవాలని కోరారు.గతంలో కూడా నిరుద్యోగులు ఇదే విషయాన్ని ఏపీపీఏస్సీ అధికారులను కోరినా విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షల్లో నెగిటివ్ మార్కులు పద్ధతిని రద్దు చేయాలని చర్చా వేదికలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో పరీక్షల్లో అభ్యర్థులకు భయాందోళన పొగొట్టడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర నాయకులు రాజేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు పి. కృష్ణ, యన్. నాగేశ్వరరావు, నాయకులు కృష్ణ, శివ నిరుద్యోగులు శ్రీనివాస్, నవీన్, కాంతారావు, ప్రజాపతి, వ్యాయము ఉపాధ్యాయ పోరట సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవేందర్ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *