జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పొత్తులపైన మాట్లాడిన మాటలు మరొకసారి దుమారాం రేగింది. పవన్‌కళ్యాణ్ మాట్లాపైన సెటైర్ వేయటానికి ఎదురు చూసే వైసిపి నేతలకు మరొక అస్త్రం దొరికింది. చంద్రబాబుకి ఊడిగం చేయటనికే పవన్ పార్టీ పెట్టారంటు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టారని మండిపడ్డారు. రైతుల పరామర్శ పేరుతో నాటకాలాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఓటింగ్ శాతం చంద్రబాబు దగ్గర బేరానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడదని విమర్శించారు. కాపులకు పవన్ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రచారం కోసం సిద్ధం చేసిన వారాహి ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్టోబర్, నవంబర్ అయిపోయింది మళ్ళీ జూన్ అంటున్నాడు. జూన్ వస్తే మళ్ళీ జనవరి అంటాడు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.
కాపులను ఎందుకు తిడుతున్నావ్ ?
ఏపీలో కులం గురించి మాట్లాడే వ్యక్తి ఒక్క పవన్ కల్యాణే అన్నారు. కుల ప్రస్తావన లేకుండా పవన్ నోరు తెరవడం లేదని చెప్పారు. 137 సీట్లు పోటీచేస్తే 30 సీట్లు అయినా గెలిపించలేదని పవన్ కాపులను తిడుతున్నాడని పేర్ని నాని తెలిపారు. అసలు కాపులు కోసం పవన్ కల్యాణ్ చేశాడని.. కాపులకు నమ్మకం ఎందుకు ఉంటుందని పేర్ని నాని ప్రశ్నించారు. రిజర్వేషన్ పేరుతో కాపుల్ని మోసం చేసిన చంద్రబాబును ఎందుకు నిలదీయలేదన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి కాపులను ధగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ మార్కెట్ ఎంత..?
భీమానాయక్ సినిమా ఫ్లాప్‌కి సీఎం జగన్‌కు సంబంధమేంటి అని పవన్‌ను పేర్ని నాని ప్రశ్నించారు.” భీమా 30కోట్లు నష్టం వచ్చిందని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అసలు పవన్ మార్కెట్ ఎంత..? 100 కోట్లు దాటిన సినిమా ఒక్కటైనా ఉందా..? సినిమా బాగాలేకపోతే కలెక్షన్లు ఎందుకు వస్తాయి. మెగాస్టార్ చిరంజీవి 60 ఏళ్లలో హిట్ కొట్టారు. వాల్తేరు వీరయ్యకు రూ.100 కోట్లు వచ్చింది. మంచి కథ ఉంటే డబ్బులు వస్తాయి. కాపీ సినిమాలు తీస్తే ఎవరూ చూడరు” అని పేర్ని నాని విమర్శించారు.