fbpx

మా బాధ కంటే …పవన్ చేసే యుద్ధమే గొప్పది : చిరంజీవి

Share the content

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన అన్నయ్య చిరంజీవి మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి పిఠాపురంలో పర్యటిస్తారు అనే వార్త గత ఐదు రోజుల నుంచి ప్రచార మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రచారానికి ప్రత్యక్షంగా ఇంతవరకు రాకపోయిన్నప్పటకి….తన తమ్ముడిని గెలిపించాలని మంగళవారం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “ప్రజాస్వామ్యంలో అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివారి వలనే సమాజం ఎక్కువుగా నష్టపోతుందని భావించే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని” చిరంజీవి అన్నారు. పవన్ బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం.. తన జీవితాన్ని రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలని తెలిపారు. పవన్ గొంతును చట్టసభల్లో వినిపించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జనమే జయమని నమ్మే జనసేనాని… భవిష్యత్తులో ఏమీ చేయగలరో చూడాలంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు…పిఠాపురం ప్రజలకు సేవకుడిగా, సైనికుడిగా అండగా ఎప్పుడు కూడా పవన్ నిలబడతారని హామీ ఇచ్చారు.

ప్రజలకు కావాల్సిన నాయకుడు పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ అమ్మ ఒడిలో ఆఖరి వాడిగా పుట్టినప్పటకి, అందరకి మేలు జరగాలనే విషయంలో ముందువాడిగా ఉంటారని కొనియాడారు.తనకంటే ప్రజల గురుంచి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం అని పవన్ కళ్యాణ్ .ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ అన్నకైన తన తమ్ముడిని అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. కానీ..ఎంతో మంది తల్లులు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది ..మన బాధ కంటే పవన్ చేసే యుద్ధం ఎంతో గొప్పదని తన తల్లికి చెప్పానని గుర్తు చేశారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగానే తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టారు.సరిహద్దు వద్ధ ప్రాణాలు అడ్డం పెట్టీ పోరాడే జవాన్ ల కోసం పెద్ద మొత్తం అందించారని గుర్తు చేశారు. పవన్ చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుల కదా ప్రజలకు కావాల్సిందని అనిపిస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *