fbpx

ఒకే దెబ్బకు రెండు పిట్టలు

Share the content

ప్రతి ఎన్నికల ముందు రాజకీయ పార్టీల్లో జోరుగా చేరికలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో సైతం వచ్చే ఎన్నికల్లో చేరికలు మార్పులు చేర్పులు బోలెడు జరగాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ అనిచ్చితి ఏర్పడడంతోపాటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అరెస్టు చేయడం ఆయన తనయుడు లోకేషను సైతం రేపో మాపొ అరెస్టు చేస్తారు అనే సమాచారం నేపథ్యంలో చేరికలు ఆగిపోయాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు భారీగా చరిత్రలు ఎన్నికల ముందు ఉంటాయని భావించారు. దీనికి సంబంధించి ఆయా పార్టీలో ఆశావహులు టికెట్ ఆశించే వారు సైతం పలు దఫాలుగా చంద్రబాబుతో చర్చలు జరిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం వాటిని అడ్డుకునేందుకు లేదా తెలుగుదేశం పార్టీ నీ పూర్తిగా బలహీనం చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు అరెస్టు చేయడం చేరికలను అడ్డుకోవడంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా వైసీపీకి కలిసి వచ్చింది.

** తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంటుందని చాలామంది రాజకీయ నాయకులు భావించారు. కచ్చితంగా ఎన్నికలకు సుమారు రెండు మూడు నెలల ముందు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు భారీగా తెలుగుదేశం పార్టీ జనసేన లో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో వైసీపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడం తో పాటు చంద్రబాబును అరెస్టు చేసి కొత్త కొత్త కేసులు పెడుతుండడంతో చాలామంది మళ్ళీ వెనక్కి వెళ్లారు. పునర్ ఆలోచనలో పడడంతో పూర్తిగా చేరికలు ఆగిపోయాయి. ప్రస్తుతం రాజకీయ అనిచ్చితి నెలకొనడంతో పాటు వచ్చే సమీప రోజుల్లో లోకేషన్ కూడా అరెస్టు చేస్తారని బయటకు రావడంతో చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇది మంచి సమయం కాదని బలంగా భావిస్తున్నారు. మరో పక్క జనసేన పార్టీ సైతం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్దాం అని చెప్పడం ద్వారా జనసేన పార్టీలో కూడా ఈ సమయంలో చేరకుండా కొన్ని రోజులు వేచి చూసే ధోరణి ని ఆశావాహులు పాటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ఎలా సొంతం అవుతుంది అన్న దానిని చూసిన తర్వాత, జనసేన పార్టీకి సుమారుగా ఎన్ని సీట్లు లభిస్తాయి అన్న అంచనాలలో స్పష్టత వచ్చిన తర్వాత చేరికలు బలం పుంజుకునే అవకాశం ఉంది. అందులోనూ వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసలు భావం ఏమిటి అన్నది ఇప్పటికీ బయటపడటం లేదు. గ్రామీణ ఓటర్లు ఒకలా ఆలోచిస్తుంటే అర్బన్ ఓటర్లు లో మరోలా ఆలోచిస్తున్న తరుణంలో మరి కొన్ని రోజులపాటు వైసీపీ నుంచి చేరికలు పూర్తిగా ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ ఎన్నికలు నాటికి మాత్రమే ఇవి పెరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *