fbpx

ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపడం జగన్ సంస్కారం

Share the content

రాజకీయంగా ప్రతి ఒక్కరి ఎదుగుదలకు స్థానిక సంస్థలు ఒక మంచి ఫ్లాట్ ఫామ్ అని టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. బుధవారం టిడిపి రాష్ట్ర కార్యాలయంలో “పంచాయతీ తోనే ప్రగతి” వర్క్ షాప్ కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలోనే పటిష్టమైన వ్యవస్థ సర్పంచ్ వ్యవస్థనని, ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని చెక్ ఇచ్చే బాధ్యత సర్పంచుకు ఉందని పేర్కొన్నారు. నిర్ణయాధికారాలు సర్పంచులకు ఉందని, ఏ అభివృద్ధి చేయాలంటే అది చేసే అధికారాలు సర్పంచులకు ఉన్నాయన్నారు. జనరల్ బాడీ, సర్పంచుల పర్మిషన్ లేకుండా ఫైనాన్స్ కమీషన్‌లు పంపించిన రూ.8,629 కోట్ల నిధులను జగన్మోహన్ రెడ్డి దారి మళ్ళించారని విమర్శించారు. సర్పంచ్ లకు అధికారం ఇవ్వండని అడిగినందుకు సర్పంచ్ ముత్యాలును పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నారు.సమస్య చెప్పిన వారిపై ఉక్కుపాదం మోపటం జగన్ సంస్కారమని తెలిపారు. రోషమున్న సర్పంచులు ఎవరూ వైకాపాలో ఉండవద్దని, మీరేం బానిసలు కాదని తెలిపారు. వ్యవస్థను కాపాడుకోవడానికి త్యాగం చేయాలని, ఇదే ప్రభుత్వం కొనసాగితే సర్పంచు లెవ్వరూ ఉండరన్నారు. కేవలం బయోమెట్రిక్ వేసేవారిని మాత్రమే ఉంటారన్నారు.పెత్తనముందని, చేతిలో అధికారముందని సర్పంచులను మోసం చేస్తూ గ్రామ సభల పర్మిషన్ లేకుండా చేస్తూ గ్రామా ప్రజలను అవమానిస్తున్నారన్నారు. స్థానిక సమస్యలకై హక్కుల కోసం పోరాడిన వ్యక్తి రాజేంద్రప్రసాద్ ను అభినందిస్తున్నాను అని తెలిపారు.

గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎప్పటికప్పుడు స్థానికి సంస్థలను బలోపేతం చేయాలని మహాత్మ గాంధీ గారు స్పష్టంగా చెప్పారన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో నరేగ డబ్బులతో గ్రామాల అభివృద్ధితో పాటు కూలీ పనులు చేసుకొనే వారికి ఉపాధి కల్పించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలోనే పెండింగ్‌లోవున్న నిధులను విడుదల చేస్తామని తెలిపారు.2002లోనే 64 అధికారాలను అన్ని డిపార్ట్‌మెంటులో సర్పంచులకు ఇచ్చామని వెల్లడించారు.2009లో మొట్టమొదటి సారిగి రూ.1,000 గౌరవ వేతనాన్ని సర్పంచులకు ఇచ్చాముని, 2016లో మరలా రూ.3000 వేతనాన్ని ఎంపీపీలకు, సర్పంచులకు పెంచామని పేర్కొన్నారు. రూ.6000 ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు వేతనాన్ని పెంచామని తెలిపారు. మరలా మూడో సారి కూడా సర్పంచుల గౌరవ వేతనాన్ని పెంచుతామన్నారు. టిడిపి హయాంలో 5 సంవత్సరాల్లో 92వేల కోట్ల నిధులను గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామని వెల్లడించారు. 25వేల కి.మీ సిమెంటు రోడ్లను వేశాం. 100 జాతీయ అవార్డులు వచ్చాయి. 21 లక్షల ఎల్ఈడీ బల్బులు వేసి రూ.1,138 కోట్లు కరేంట్ ఆదాయం చాశాం. 2,115 పంచాయితీ బిల్డింగ్‌లు, 5,885 అంగన్‌వాడీ భవనాలు, 2,251 స్మశాన వాటికలు, 22 లక్షల మరుగుదొడ్లు, 9,599 కేంద్రాల ద్వారా సంపదను సృష్టించటం అన్ని కూడా సర్పంచుల ఆధ్వర్యంలో చేశామన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో 8% రిజర్వేషన్‌లు టిడిపి అమలు చేసిందన్నారు. వెనుకబడిన వర్గాల వారికి 33% రిజర్వేషన్ పెట్టామని వెల్లడించారు.

రాబోయే రోజుల్లో స్థానిక స్వపరిపాలన, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పేరుతో డిక్లరేషన్‌ను ప్రకటిస్తున్నామని తెలిపారు. 73,74 రాజ్యాంగ సవరణను అమలు పరిచి పంచాయితీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి క్షేత్ర స్థాయిలో పాలన, ప్రణాలిక ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులల్లో ఒక్క రూపాయి కూడా కట్ అవ్వకుండా సర్పంచులకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను,. ఎవరికి ఏ సబ్సిడీ ఇవ్వాలన్నా అవి సర్పంచుల ద్వారానే ఇచ్చే విధంగా చేస్తాం. రాష్ట్ర బడ్జెట్‌లో 5% పంచాయితీరాజ్ కు వచ్చేలా చేసి దానిని 5 సంవత్సరాల్లో 10% చేస్తాం. ఏ పని గ్రామంలో జరగాలన్నా సర్పంచ్, గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో జరిగేలే చేస్తాము. నరేగా నిధులను సాంక్షన్ చేస్తాం. సోషల్ ఆడిట్ సర్పంచులు చేసే విధంగా చేస్తాం. జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు వచ్చినా జగన్ మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు. ప్రతీ ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి మంచి నీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. సర్పంచులకు చెక్ పవర్‌ని ఇచ్చాము. కానీ జగన్మోహన్ రెడ్డి చెక్ పవర్ ఇవ్వకుండా దొంగల మారిగా చూస్తున్నారన్నారు. కౌన్సిలర్‌లకు, సర్పంచులకు రూ.3 వేలు ఉన్న వేతనాన్ని రూ.10 వేలకు పెంచే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఎంపీటిసిలకు రూ.10వేలు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు రూ. 15వేలకు పెంచుతామని వెల్లడించారు.

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తెలిపారు.రేపు జరిగే ఎన్నికలు పార్టీలు, వ్యక్తులు కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం, 5 కోట్లు ప్రజల కోసం జరిగే ఎన్నికలని పేర్కొన్నారు. ఆర్‌&బీ, విద్యా, ఆరోగ్యం, అన్నీ వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ట్రస్టీగా ఉండి ప్రజల కోసం పాలన చేయాలి తప్ప ఇష్ట ప్రకారం చేయటం మంచిది కాదన్నారు. వైసీపీ పాలకుల అసమర్ధ పాలనతో పోలవరం డాయఫ్రం వాల్ కొట్టుకు పోయిందని వాపోయారు. పోలవరంపై పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ముక్కలాట ఆడి చివరకు రుషికొండకు గోడు గుండు కొట్టి రూ.500 కోట్ల భవనాన్ని ముఖ్యమంత్రి కట్టుకున్నారన్నారు.రూ.3 వేలు పెన్షన్ ఇచ్చానాని నేడు జగన్ కాకినాడ లో చెప్తున్నారు,జగన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 2 వేలు ఉన్న పెన్షన్ ను 3 వేలు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. తాను ఆధికారంలోకి రాగానే 2 వందలు ఉన్న పెన్షన్ ను రూ. 2 వేలు చేస్తామన్న హామీని నెరవేర్చాం. ప్రజలకు సేవ చేయాలి తప్ప ముఖ్యమంత్రులు సేవలు చేయించుకోవడం కాదని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *