fbpx

వై.యస్. షర్మిళ వెంట నడుస్తా : ఆర్కే

Share the content

వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి సేవ చేసి సర్వస్వం పోగట్టుకున్నానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వై.యస్ షర్మిళ ఏపి కాంగ్రెస్ నుంచి రాజకీయాలు మొదలుపెడితే తాను ఆమె వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని,ఇటీవల షర్మిలను కలిశానని,అతి త్వరలోనే కీలక విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

అప్పులు చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాను
అధికార పార్టీ ఎంచుకున్న అభ్యర్థులను ఒడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రూ. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం రూ.120 కోట్లను మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించానని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తెచ్చినా.. తాను సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగానన్నారు. స్వయంగా తానే రూ.8కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని వివరించారు.తన సొంత డబ్బుతో ఎంటీఎంసి, దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. గత ఎన్నికల్లో లోకేష్ ను ఓడించినప్పటికీ ప్రభుత్వ సహకారం అందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ధనుంజయ రెడ్డి నిధులు మంజూరు చేస్తానని చాలా సార్లు మేస్సెజ్ పెట్టారని, ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారంటూ ప్రశ్నించారు.

రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టమని.. తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చానంటూ ఆర్కే స్పష్టంచేశారు. మంగళగిరి ప్రజలకు తాను దూరంగా ఉండనంటూ ఈ సందర్భంగా వివరించారు. వైసీపీకి రాజీనామా చేశానని.. వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదంటూ ఆర్కే పేర్కొన్నారు. సీఎం జగన్ కు పులివెందుల అభివృద్ధి ఎలా అవసరమో మంగళగిరి, గాజువాక, భీమవరం కూడా అలాగే అభివృద్ధి చెందాలని తెలిపారు. అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు.. తనకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టే రాజీనామా చేశానంటూ పేర్కొన్నారు. నియోజవర్గ పరిధిలో అభివృద్ధి జరగకపోతే పార్టీలో ఉన్నా లేకున్నా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

వైసిపి పై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధం
వైసిపికి రాజీనామా చేసినప్పటికీ గతంలో ఇన్నర్ రింగ్ రోడ్, ఒటుకి నోటు కేసు మీద వేసిన కేసులను వెనక్కు తీసుకోనని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ కు వెళ్ళినా రేవంత్ రెడ్డి, చంద్రబాబు విషయంలో వెనక్కు తగ్గనని పేర్కొన్నారు.తప్ప ఎవరూ చేసినా తప్పేనని తెలిపారు. వైసిపి ప్రభుత్వం తప్పులు చేసినా కేసులు వేసేందుకు వెనుకాడనని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *