fbpx

మతం ఆధారంగా చట్టాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం : రమణరాజు

Share the content

మన కాకినాడ మన ఉగాది మన రంజన్ అనే శీర్షికతో కాకినాడ ఖిద్మత్ కమిటీ వ్యవస్థాపక మాజీ అధ్యక్షులు హసన్ షరీఫ్ అధ్యక్షతన ఇఫ్తార్ విందు ను పీఆర్ భవన్ లో ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భోగి గణపతి పీఠాధిపతి శ్రీ దుసర్లపూడి రమణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత దేశ పరిస్థితులకు మతం ఆధారితంగా చట్టాలను చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలును..ముస్లిం సమాజం పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని హిందువులు అందరూ ఖండించి వారికి అండగా నిలవాలని కోరారు. హాసన్ షరీఫ్ మాట్లాడుతూ…. ఖిద్మత్ కమిటీ ఎల్లపుడు జాతి సమైఖ్యతను కాంక్షిస్తుంది అని అందుకే ఆపదలో ఉన్న వారు ఏ మతం అని చూడకుండా మా కమిటీ సభ్యులు ఆదుకోవడం ఆచరణాత్మకంగా భారత దేశ లౌకిక స్వరూపాన్ని చాటుతుంది అని కొనియాడారు. అనంతరం సమాచార హక్కు చట్ట రాష్ట్ర సమితి నాయకులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ… వచ్చే ఏడాది హిందువులు ముస్లిం సోదరులకు పిలిచి ఇఫ్తార్ విందు ఇచ్చి మరింతగా కాకినాడలో ఐకమత్యాన్ని చాటుదామని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు చిష్టి కార్యదర్శి హుస్సేన్ , కోశాధికారి గౌస్ సభ్యులు ఫక్రుద్దీన్ ఆలీ, నసీర్ సాధిక్, గణేష్ ,భాషా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *