fbpx

సామాజిక న్యాయానికి పూలే రూపకల్పన : జే. నివాస్

Share the content

రెండు వందల సంవత్సరాల క్రితమే బడుగు బలహీనల వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం అనే కొత్త ఆలోచన విధానాన్ని మహత్మ జ్యోతీరావ్ పూలే రూపకల్పన చేశారని కాకినాడ జిల్లా కలెక్టర్ జే. నివాస్ తెలిపారు.దేశంలో ఉన్న నాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి ఫూలే అని, ఆయన కాంక్షించిన సామాజిక న్యాయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గురువారం మహాత్మ జ్యోతిరావ్ ఫూలే 198వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జీజీహెచ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ జే నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్, పలువురు ప్రముఖలు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ….మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం తెలుసుకోవచ్చన్నారు. దేశంలో మహాత్మా అని గాంధీజీ, ఫూలేలను మాత్రమే మనం గౌరవంగా పిలుస్తామని పేర్కొన్నారు. మహిళలకు విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుకుంటున్నా సమయంలో తన భార్యకు ముందుగా విద్యనందించి ఆమె ద్వారా మహిళల విద్య వ్యాప్తికి ఎన్నో సంస్థలు ఆయన స్థాపించారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ అద్దంకి శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎ వెంకటలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి; జౌళి శాఖ ఏడీ పెద్దిరాజు, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారులు టీవీబీ ప్రసాద్, ఎన్ రాజేశ్వరి, ప్రజా, బీసీ సంఘాల నేతలు కోనేటి రాజు, చొల్లంగి వేణుగోపాల్, వాసంశెట్టి రాజేశ్వరరావు, మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, కండిపల్లి వెంకటరమణ, కుండల సాయికుమార్, అయినవిల్లి నారాయణ, బొబ్బిలి రాజేశ్వరరావు, సుందరపల్లి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *