fbpx

గతి తప్పిన లోకేష్ పాదయాత్ర!

Share the content

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ఎక్కడో లెక్క తప్పుతున్నట్లు కనిపిస్తోంది. కేవలం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే సాగుతున్న యాత్ర రాత్రికి రాత్రి జిల్లాలను మారిపోవడం చూస్తుంటే అసలు లోకేష్ పాదయాత్ర అంతరార్థం ఏమిటో అంతుబట్టడం లేదు. పాదయాత్ర అంటే ఏకధాటిగా నడవాల్సి ఉంటుంది. అయితే లోకేష్ పాదయాత్ర మాత్రం దీనికి విభిన్నంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. వేయడానికి మాత్రం 2000, 2500 కిలోమీటర్లు దూరం యాత్ర పూర్తి అయినట్లు రాళ్లు వేస్తున్నారు తప్పితే ఆయన పూర్తిగా అంత దూరం నడిచారా అంటే నమ్మశక్యంగా మాత్రం కనిపించడం లేదు. కేవలం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలను ఎంచుకొని నడుస్తూ, అవసరమైన కార్యక్రమాలను ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తూ అక్కడి నుంచి ఆయన వేరే నియోజకవర్గానికి కారు మార్గంలోనే ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర పూర్తి స్వరూపాన్ని లోకేష్ మార్చేశారు. కేవలం ఆయా నియోజకవర్గాల్లో కొన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు తప్పితే ఏకధాటిగా మాత్రం ఆయన పాదయాత్ర చేయడం లేదు.

లోకేష్ పాదయాత్రను అనుకూల మీడియా సైతం పూర్తిస్థాయిలో కవర్ చేయడం లేదు. ఎప్పటికప్పుడు లైవ్లు ఇవ్వడం లేదు. కేవలం బహిరంగ సభలో ఇతర పెద్ద కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నారు తప్పితే ఏకధాటిగా మాత్రం ప్రత్యక్ష ప్రసారాలు ఏ ఛానల్ లో కూడా లేవు. ఇది ఒక క్రమ పద్ధతి ప్రకారం ముందుగా అనుకున్న మేరకు మాత్రమే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేస్తున్న విధానం. గుంటూరు జిల్లాలో కేవలం ఐదు రోజులు అలాగే కృష్ణా జిల్లాలో సుమారుగా వారం రోజులు మాత్రమే ఉన్న లోకేష్.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ చింతలపూడి పోలవరం నియోజకవర్గం మాత్రమే పాదయాత్ర చేశారు. ఆ వెంటనే ఉండి నియోజకవర్గం వెళ్లిపోయిన లోకేష్ పూర్తిస్థాయిలో పశ్చిమగోదావరి జిల్లాలో తిరగనే లేదు. దీంతో లోకేష్ అసలు పాదయాత్ర చేస్తున్నారా లేక షో చేస్తున్నారా అన్న అందరికీ కలుగుతోంది. లోకేష్ పాదయాత్రలో పూర్తిగా పారదర్శకత లోపించింది అన్నది వైసీపీ వాదన. రోజుకి కొద్ది దూరం నడిచి తర్వాత కారులో ప్రయాణించి అనుకున్న ప్రదేశానికి లోకేష్ చేరుకుంటున్నారని అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు అని గ్రౌండ్ లెవెల్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇలా లోకేష్ పాదయాత్ర చేయడం వల్ల టిడిపికి ఏమాత్రం ప్రయోజనం చేయకూడదు. మరో వాదన ఏమిటంటే లోకేష్ పాదయాత్రకు ఇప్పటికే చాలా డబ్బులు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించిందని, దానిని పూర్తిగా తగ్గించుకోవడానికి లోకేష్ పాదయాత్రను సైతం అనుకున్న నియోజకవర్గాల్లో కొద్ది దూరం నడిపించి తర్వాత మమ అనిపిస్తున్నారు అని తెలుస్తోంది. ఒక్కరోజు పాదయాత్ర చేస్తే సుమారు 50 లక్షలకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉండడంతో పాటు లోకేష్ పాదయాత్రను అంత ఆర్థికంగా భరించే శక్తి ఎవరి వద్ద లేకపోవడంతోనే పాదయాత్రలో అనుకున్న నియోజకవర్గాల్లో మాత్రమే నిర్వహించి పూర్తిచేయాలని భావిస్తున్నారు. లోకేష్ బహిరంగ సభలకు ఎప్పటికీ జన సమీకరణ చాలా కష్టతరం అవుతున్న సమయంలో బహిరంగ సభలు కూడా బాగా తగ్గించారు. చాలా సాదాసీదాగా సభలను నిర్వహిస్తూ పూర్తి దూరం నడిపించడం అనే రీతిలో ఇచ్చాపురం చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. డిసెంబరు వరకు కూడా లోకేష్ పాదయాత్ర ఇదే దిగిన అయితే సాగేలా కనిపించడం లేదు. మొత్తానికి ఎన్నో జయప్రయాశులు గూర్చి సాగిన లోకేష్ పాదయాత్ర చివరకి గజ తప్పి ముగిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *