fbpx

కలిసి అడుగేస్తున్న నేతలు!

Share the content

జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు విషయంలో నేతలు వేస్తున్న అడుగులు హర్షించదగించే విధంగా ఉన్నాయి. పెడన వారాహి విజియాత్ర సభలో పవన్ కళ్యాణ్ శ్రేనులను ఉత్సాహపరిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ సభకు రావడం కనిపించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులంతా పెడన వారాహి సభలో పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికారు. ఎన్నడు లేనట్లుగా పెడన సభలో తెలుగుదేశం పార్టీ జెండాలతో పాటు జనసేన పార్టీ జెండాలు కళకళలాడాయి. పొత్తులు సమర్థంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఒక ప్రణాళిక యుతమైన వ్యూహంగా దీన్ని చెప్పుకోవచ్చు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తును ప్రజలు అంగీకరించారు కానీ కార్యకర్తల్లో ఎక్కడో మూల సందేహం ఉంది అనే రీతిలో.. గతంలో రెండు పార్టీల కార్యకర్తలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో నేతలు ముందుకు వచ్చి ముందుగా వారి కలయికను పార్టీ శ్రేణులకు తెలియపరచడం ఓ తెలివైన అడుగుగా భావించవచ్చు.

వారాహి విజయయాత్ర సభలో సైతం పవన్ కళ్యాణ్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు మెచ్చేలా ఆయన ప్రసంగం సాగిన తీరు అందరితో శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా పోలీస్ కేసులు ఒక పార్టీ మీద పెడితే మరో పార్టీ వారు వెళ్లాలని అలాగే ఇరువురు అన్ని కార్యక్రమాలు కలిసి చేయాలని ఆయన వారాహి రథం సాక్షిగా పిలుపునిచ్చారు. రెండు పార్టీలకు అభిప్రాయ బేధాలు ఉండవచ్చు కానీ జగన్ అనే బలమైన వ్యక్తిని ఢీ కొట్టాలి అంటే కచ్చితంగా సహకారం అవసరం అని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో సంయుక్తంగా ఎంత బలంగా పనిచేయాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు అయింది. పదవుల పంపకం ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు కావని ఎన్నికల తర్వాత దాని గురించి ఆలోచిద్దామని చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది. ముఖ్యంగా పవన్ ప్రసంగాలు చాలా స్పష్టంగా రెండు పార్టీల కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు పవన్ పూర్తిగా ముందుండి నడిపించే బాధ్యతను తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేయడం, రాజకీయ వ్యూహాలను బలంగా ఎదుర్కోవడం పవన్ ఇప్పుడు అలవాటు చేసుకున్నారు. పెడన సభలో వారాహి విజయాత్రపై రాళ్లదాడి జరుగుతుంది అని ముందుగా తనకు వచ్చిన సమాచారాన్ని బయటపెట్టడం ద్వారా ప్రత్యర్థులను హెచ్చరించినట్లు అయింది. పోలీసులు కూడా అదే రీతిలో స్పందించి బందోబస్తు ఏర్పాటు చేయడం పవన్ కళ్యాణ్ చాకచక్యమైన నాయకత్వ తీరుకు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. గతంలో చంద్రబాబు కూడా చిత్తూరు టూర్ లో ఉన్నప్పుడు అంగళ్లు లో తీవ్ర దుమారం రేగి.. చంద్రబాబుతో సహా సుమారు 80 మంది టిడిపి నేతలపై కేసులు పెట్టారు. అలాంటిది మళ్లీ మరోసారి అవకాశం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ తెలివిగా వ్యవహరించారు అని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో వైసిపి ధమనకాండను అడ్డుకుంటాం అని చెపుతూనే… తమ మీద ఎలాంటి దాడి జరగకుండా ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత వహించాలి అని చెప్పడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కూడా ప్రయత్నించారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేన కార్యకర్తలను సమన్వయం చేయడంలో కూడా పవన్ విజయం సాధిస్తున్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల నాటికి ఎంత మేర ఇరు పార్టీల కార్యకర్తలను ఎందుకు తీసుకువెళ్తుంది అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *