fbpx

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బొత్సకు అవగాహన శూన్యం : శివ శంకర్

Share the content

ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా….రైతుల మెడకు ఉచ్చు బిగించేలా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివ శంకర్ విమార్శించారు.శుక్రవారం మంగళగిరి లోని రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నీతి ఆయోగ్ విధి విధానాల ప్రకారం భూమి సర్వేలు మూడు దశల్లో నిర్వహించి వాటి వివరాలను డిజిటల్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. భూ యజమానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భూ సర్వే చేయడం వలన పెద్ద ఎత్తున భూ వివాదాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు సర్వే నంబర్లు ఉన్న చోట ఒకే ల్యాండ్ పార్శిల్ నంబర్లు జారి చేయటం వలన రైతులు అయోమయంకు గురి అవుతున్నారని పేర్కొన్నారు.ఎల్.పి.యం.,ఎల్.పి.యన్ లో దొర్లే పొరపాట్ల కారణంగా బ్యాంకుల్లో రైతులు రుణాలు పొందలేకపోతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు.1 బి పత్రాలు కోసం రైతులు రెవిన్యూ కార్యాలయాలు చుట్టూ తిరిగే దుస్థితి నెలకొంది అని అన్నారు.వాస్తవాలు చెప్పకుండా ప్రజలను తప్పు దారి మల్లించేలా మంత్రి బొత్స సత్యారాయణ ప్రకటనలు చేయడం సరికాదన్నారు.

వైసిపికి ఓటమి భయం పట్టుకుంది

ఎన్డీయే పార్టీల ఐక్యత చూసి వైసిపికి ఓటమి భయం పాటుకుందని విమర్శించారు.మేనిఫెస్టో పై కూటమి నేతల మధ్య ఐక్యత లేదంటూ వైసిపి నేతలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.మేనిఫెస్టో లోని సుపర్ సిక్స్ అంశాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి అని పేర్కొన్నారు.కూటమి మధ్య ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్డీయే విజయాన్ని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.జనసేన కార్యకర్తలు పై పెర్ని కిట్టూ అనుచరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *