fbpx

కొణతాల అక్కడి నుంచే..

Share the content

అత్యంత సౌమ్యుడిగా, హుందా రాజకీయాలు చేస్తారని పేరున్న కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలోకి రాబోతున్నారు అన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. గవర సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ అన్ని విషయాలు పైన పట్టు ఉన్న కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర జిల్లాలో బలమైన నేత. ఉత్తరాంధ్ర హక్కుల పరిరక్షణ సమితికి ఇప్పుడు నాయకుడుగా వ్యవహరిస్తున్న కొణతాల రామకృష్ణ రాబోయే రోజుల్లో రాజకీయ స్టాండ్ తీసుకోబోతున్నారని దీనిలో భాగంగా జనసేన పార్టీలో త్వరలో చేరిపోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. 1989లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 2014లో వైసీపీ నుంచి బయటకు వచ్చిన రామకృష్ణ తర్వాత సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికే కొణతాల రామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఒక్కో బలమైన నాయకుడిని జనసేన వైపు ఆకర్షిస్తున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విరామ సమయంలో నాయకులను చేర్చే పనిలో పడ్డారు. ఇప్పట్లో సినిమా షూటింగులు లేకపోవడంతో కచ్చితంగా మంగళగిరి కార్యాలయంలోనే అందుబాటులో ఉంటూ రాజకీయ వ్యవహాలకు పవన్ కళ్యాణ్ పదును పెట్టనున్నారు. కొణతాల రామకృష్ణ కనుక జనసేన పార్టీలో చేరితే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బలమైన నేత జనసేన పార్టీలో చేరినట్లే భావించాలి.

అనకాపల్లి లేదా విశాఖపట్నం నుంచి..

కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరితే ఆయనను పార్లమెంటుకు పంపాలి అనేది జనసేన వ్యూహంలా కనిపిస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అన్ని రకాలుగా పట్టున్న కొణతాల రామకృష్ణ కచ్చితంగా ప్రజల గొంతును పార్లమెంటు వేదికగా వినిపిస్తారని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాతినిధ్యం కూడా పార్లమెంటులో పెరగాలి అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. దీంతో కొడతారా రామకృష్ణను అనకాపల్లి లేదా విశాఖపట్నం నుంచి పార్లమెంటుకు పోటీ చేయించాలి అని జనసేన పార్టీ ఆలోచిస్తోంది. కొణతాల రామకృష్ణతో ఇప్పటికే చర్చలు పూర్తి ఇవ్వడంతో ఆయన నిర్ణయం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. కాంగ్రెస్ లో చాలా కాలం పాటు పనిచేసిన రామకృష్ణ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తే అన్ని విషయాలపై పట్టు ఉన్న నేత రాజకీయాలకు వచ్చినట్లే అవుతుంది. ఒక దఫా వాణిజ్య పనుల శాఖ మంత్రిగా పనిచేసిన కొణతాల చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండి ఇప్పుడు రాజకీయ స్టాండ్ కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయనతో పాటు మరికొంతమంది నాయకులు కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *